|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పెద్ది వాయిదా పడుతుందా? కారణం ఏంటంటే..

Published: 11-12-2025, 6:49 AM
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పెద్ది వాయిదా పడుతుందా? కారణం ఏంటంటే..
  • రామ్ చరణ్ ‘పెద్ది’కి బుచ్చిబాబు సనా దర్శకత్వం, జాన్వీ కపూర్ హీరోయిన్, శివరాజ్ కుమార్ కీ రోల్.
  • ‘పెద్ది’ సినిమా మార్చి 27, 2026న విడుదల చేయాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు.
  • సోలో రిలీజ్ కోసం వాయిదా పడుతుందన్నవి కేవలం ఇండస్ట్రీ రూమర్స్ మాత్రమే, నిజం కాదు.
  • దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి కల్లా అన్ని పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయనున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ వాయిదా వార్తపై స్పష్టత. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే, మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దర్శకుడు బుచ్చిబాబు మార్చి 27, 2026న సినిమా విడుదల చేయాలని పక్కాగా ఉన్నాడని తెలుస్తోంది.

పెద్దిపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు

Peddi; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే పెద్దిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎన్నడూ లేని విదంగా పెద్ది సినిమా గురించి ఓపెన్ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో, మెగా ఫ్యాన్స్ కూడా పెద్ది(Peddi) సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Akhanda 2: తెలంగాణాలో అఖండ 2 టికెట్ హైక్స్ రద్దు.. జీవో కొట్టేసిన హైకోర్టు.. మరి బుక్ చేసుకున్నవాళ్ళ పరిస్థితి ఏంటి?

సినిమా వాయిదా వార్తలలో నిజమెంత?

ఇక పెద్ది సినిమా రిలీజ్ విషయంలో కూడా మేకర్స్ ముందు నుంచి పక్కా ప్లానింగ్ లో ఉన్నారు. అనుకున్నట్టుగానే ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ సాగుతోంది. అనుకున్నట్టుగానే ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ, తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మేరకు పెద్ది సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. దానికి, కారణం పెద్ది సినిమా కోసం మేకర్స్ సోలో రిలీజ్ కోసం చూస్తున్నారు. కానీ, మార్చ్ ఎండింగ్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందుకే ఈ సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్.

డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ పక్కాగా ఉందా?

అయితే, సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఈ న్యూస్ కేవలం రూమర్స్ అని తెలుస్తోంది. మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి, ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇక, పెద్ది సినిమాను మార్చ్ 27న పక్కాగా విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యాడట దర్శకుడు బుచ్చిబాబు. తాను ప్లాన్ చేసుకున్నట్టుగానే అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి కల్లాకంప్లేట్ చేస్తున్నాడట. కాబట్టి, సినిమా వాయిదా పడటం అనేది అసంభవం. ఇక పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. చికిరి సాంగ్ కి మించి ఈ పాట ఉంటుందని ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్.

మొత్తానికి, ‘పెద్ది’ వాయిదా వార్తలు కేవలం పుకార్లే అని తేలింది. రామ్ చరణ్ అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ చేసినట్లే మార్చి 27న సినిమా విడుదల కానుంది. త్వరలో రెండవ పాట అప్డేట్ కూడా రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.