
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు సుశీల్ కుమార్ సింగ్ ఆసక్తికరమైన అంచనాలు వెల్లడించారు. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Key Points
జాన్వీ కపూర్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉందని జ్యోతిష్యుడు పేర్కొన్నారు.
2026 మధ్యకాలం తర్వాత ఆమెకు సినిమాల పరంగా మంచి ఫలితాలు వస్తాయని అంచనా.
ఈ ఏడాది చివరిలో లేదా 33 ఏళ్ల వయసులో ఆమె వివాహం జరగవచ్చని అభిప్రాయం.
ఆమె వైవాహిక జీవితం సజావుగా ఉంటుందని, కానీ కొన్ని గ్రహాల అమరికల వల్ల ఆకస్మిక మార్పులు సంభవించవచ్చని విశ్లేషణ.
జాన్వీ కపూర్ భవిష్యత్తుపై జ్యోతిష్య శాస్త్రం
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అతిలోకి సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని దక్కించుకుంది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తన నటన, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక తెలుగులో మొదటి సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)సరసన ‘దేవర’ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది.
వివాహం ఎప్పుడు జరుగుతుంది?
ఇక ఇప్పుడు జాన్వీ సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) సరసన ‘పరం సుందరి’ చేస్తోంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’ మూవీలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా (Buchibabu Sana)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవల జరిగిన ప్రత్యేక చాట్‌లో, జ్యోతిష్కుడు సుశీల్ కుమార్ సింగ్, జాన్వీ కపూర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ జాన్వీ కపూర్ భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంది. 2026 మధ్యకాలం తర్వాత, జాన్వీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆమెకు సినిమాల పరంగా కలిసివస్తుంది.
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది?
హిట్స్ సాధించడంతో పాటు ఫేమ్‌ను మరింత పెంచుకుంటుంది. ఈ సంవత్సరం చివరి నాటికి జాన్వీ వివాహం చేసుకుంటే అది ఆదర్శంగా ఉంటుంది. కాకపోతే, ఆమె 33 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకునే అవకాశం ఉంది. తన వైవాహిక జీవితం సజావుగా ఉంటుంది కానీ గ్రహాల అమరికలు, ముఖ్యంగా చంద్రుడు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఇతర గ్రహాలు కీలక పాయింట్లలో ఉన్నప్పుడు, ఆకస్మిక మార్పులకు దారితీయవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఈ అమ్మడు గత కొద్ది కాలంగా శిఖర్ పహాడియాతో ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అతడితో త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది కావచ్చని అంతా చర్చించుకుంటున్నారు.
జాన్వీ కపూర్ వృత్తి జీవితం, వైవాహిక జీవితంపై జ్యోతిష్యుడి అంచనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలంటే కాలమే నిర్ణయించాలి.


