
తెలంగాణ ఫోక్ సింగర్ జాను లిరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకుందని వార్తలు వైరల్‌గా వ్యాప్తి చెందుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పెళ్లి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Key Points
జాను లిరి రెండో పెళ్లి వార్తలు వైరల్‌గా వ్యాప్తి చెందుతున్నాయి.
నెట్టింట జాను, దిలీప్ దేవ్ గన్ పెళ్లి వీడియో చక్కర్లు కొడుతోంది.
వీడియోలో జాను, దిలీప్ మెడలో పూల దండలు వేసుకున్నట్లు కనిపిస్తోంది.
కొందరు ఫోటో ఎడిటింగ్ అని, మరికొందరు నిజమని వాదిస్తున్నారు.
జాను లిరి వైరల్ వీడియో
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ ఫుల్ పాపులర్ అయిన జాను లిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే ఫేమ్‌తో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి పర్‌ఫార్మెన్స్‌తో విజేతగా నిలిచి, సెలబ్రిటీ స్టేటస్ సాధించింది. అయితే అక్కడ శేఖర్ మాస్టర్ ఈ బ్యూటీకి బాగా సపోర్ట్ చేయడంతో నెట్టింట తెగ ట్రోల్స్‌కి గురి అయింది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కనిపించినా ఏం చేసిన విమర్శల పాలవుతునే ఉండేది. దీంతో సహనం కోల్పోయిన ఈ బ్యూటీ చచ్చిపోతానని ఓ వీడియో రిలీజ్ చేసింది.. ఆ తర్వాత రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాను అందరూ ఆశీర్వదించండి అని అబ్బాయితో ఉన్న ఫొటో షేర్ చేసి బిగ్ బాంబ్ పేల్చింది.
ఈ క్రమంలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో జానీ లిరీ, ఫోక్ సింగర్ దిలీప్ దేవ్‌గన్‌లు మెడలో పూలదండ వేసుకుని కనిపించారు. అలాగే ఈ వీడియోకు జల్దీ రావా బావా సాంగ్‌ను యాడ్ చేశారు. దీంతో జాను అప్పుడే రెండో పెళ్లి కూడా చేసుకుందా అని సందేహ పడుతున్నారు, అలాగే ఇప్పుడు పెళ్లి వీడియో తర్వాత శోభనం వీడియో కూడా పెట్టండి చూసి తరిస్తామని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆ ఫొటో ఎడిటింగ్ చేసిందని కొట్టిపారేస్తున్నారు.
పెళ్లి ఫోటోలపై వివాదం
నిజమేనా? ఎడిటింగ్ ఫోటోనా?
జాను లిరి రెండో పెళ్లి వార్తలపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియో నిజమో, నకిలీయో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.


