|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..

Published: 26-05-2025, 12:05 PM
Jaya Prakash Reddy : జయప్రకాశ్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే..

దాదాపు 300 సినిమాల్లో నటించిన జయప్రకాశ్ రెడ్డి గారి జీవితం చాలా ఆసక్తికరమైనది. ఆయన సినిమా రంగంలోకి రాకముందు ఉపాధ్యాయునిగా పనిచేసేవారని తెలుసుకుందాం. ఆయన కూతురు మల్లికా రెడ్డి ఆయన జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Key Points

1

జయప్రకాశ్ రెడ్డి గుంటూరులో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు.

2

1985లో స్కిట్స్ ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు.

4

‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో మళ్ళీ సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

ఉపాధ్యాయుడిగా జయప్రకాశ్ రెడ్డి

Jaya Prakash Reddy : దాదాపు 300లకు పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జయప్రకాశ్ రెడ్డి 2020 కరోనా సమయంలో మరణించారు. ఇటీవల ఆయన కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తండ్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

సినిమా రంగ ప్రవేశం

మల్లికా రెడ్డి మాట్లాడుతూ.. మా నాన్న గుంటూరు మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా చేసేవారు. 1985లో పిల్లలతో స్కిట్స్ వేయించడానికి వెళ్లినప్పుడు మా నాన్న కూడా కొన్ని స్కిట్స్ వేశారు. ఆ కార్యక్రమానికి రామానాయుడు గెస్ట్ గా వచ్చారు. ఆయన సినిమాల్లోకి రమ్మన్నారు. దాంతో నాన్న మద్రాస్ వెళ్లారు. కొన్ని సినిమాలు చేసాక అవకాశాలు లేకపోవడంతో 1993 లో మళ్ళీ వెనక్కి వచ్చి టీచర్ జాబ్ చేసారు. 1997లో మళ్ళీ రామానాయుడు గారికే కనపడటంతో సినిమాలు చేయకుండా వచ్చేసావా అని అడిగి మళ్ళీ తీసుకెళ్లారు. ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ వేషం ఇప్పించారు. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోలేదు అని తెలిపారు.

మళ్ళీ సినిమాలకు తిరిగి రావడం

జయప్రకాశ్ రెడ్డి గారి సినీ ప్రయాణం ఒక ఉత్తేజకరమైన కథ. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన జీవితం, సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలను సాధించింది. ఆయన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.