
సినిమా నటులు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అయితే, కొందరు నటులు, జయలలిత లాంటి వారు, విలాసవంతమైన ఆస్తులను కూడా సంపాదించారు. ఈ కథనంలో హైదరాబాద్‌లోని జయలలిత ఆస్తి గురించి తెలుసుకుందాం.
Key Points
హైదరాబాద్‌లో 14 ఎకరాల ద్రాక్షతోట, భారీ ఫామ్ హౌస్‌తో అలనాటి హీరోయిన్!
మురళీ మోహన్ వెల్లడించిన ఆశ్చర్యకరమైన విషయం!
జయలలితకు చెందిన ఆ విలాసవంతమైన ఆస్తి గురించి వివరాలు!
ఆ ఆస్తి ప్రస్తుత స్థితి ఏమిటి?
అలనాటి హీరోయిన్ల ఆర్థిక జాగ్రత్తలు
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్లు అయినా ఎవరైనా సరే స్టార్ డమ్ ను నిలబెట్టుకోవడంతో పాటు, ఆర్ధికంగా జాగ్రత్తగా లేకపోతే, ఎంత సంపాధించినా చివరకు పేదరికంతో ఇబ్బందిపడాల్సిందే. సావిత్రి, గిరిజ, రాజనాల, కాంతారావు లాంటి ఎంతో పెద్ద పెద్ద యాక్టర్లు డబ్బు విషయంలో జాగ్రత్తపడకపోవడం వల్లే, చివరిదశలో ఎన్నో కస్టాలు అనుభవించారు. కాని అదే టైమ్ లో అక్కినేని నాగేశ్వారావు, శోభన్ బాబు, మురళీ మోహన్ లాంటి స్టార్లు తాము సినిమాల్లో సంపాదించినది వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం, భూములు కొనడం ద్వారా వేల కోట్ల ఆస్తిని సంపాదించుకోగలిగారు.
ఈక్రమంలో హీరోయిన్లు కూడా ఎంతో మంది ఆస్తులు కొని ఆతరువాత కాలంలో కోటీశ్వరులుగా బ్రతికారు. ఆతరం తారలు చెన్నైలోనే కాదు, హైదరాబాద్ లో కూడా ఆస్తులు కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలో హైదరాబాద్ లో అలనాటి హీరోయిన్ కు 14 ఏకరాలలో ద్రాక్షతోట, అందులో పెద్ద ఫామ్ హౌస్ ఉండేదట. ఆ హీరోయిన్ కు మనసు బాగాలేకపోతే అక్కడికి వచ్చి ఓ పది రోజులు రెస్ట్ తీసుకునివెళ్లేవారట. ఆతోట చుట్టు పెద్ద పెద్ద గోడలతో సెక్యూరిటీ కూడా ఉండేదట . ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జయలలిత హైదరాబాద్ ఆస్తి
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత. అవును తమిళులు అమ్మ అని ఆరాధించే ఆమె, హీరోయిన్ గా ఎన్ని సినిమాల్లో నటించారో తెలిసిందే. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన జయలలిత, ఆతరువాత రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. కేజీల కొద్ది బంగారం , ఆస్తుల విషయంలో కేసులు కూడా ఫేస్ చేశారు. అయితే ఆమెకు చెన్నైతో పాటు హైదరాబాద్ లో కూడా ఎన్నో ఆస్తులు ఉన్నాయని ఓ ఇంర్వ్యూలో ఆతరం నటుడు మరళీ మోహన్ అన్నారు.
మురళీ మోహన్ వెల్లడి
మురళీ మెహన్ ఇండస్ట్రీకి రాకముందే జయలలితకు హైదరాబాద్ లో 14 ఎకరాల్లో ద్రాక్షతోట ఉండేదని, అందులో పెద్ద రాజభవనం కూడా ఉందని, మనశ్శాంతి కోసం ఆమె అక్కడికి వచ్చేవారట. మరి ఇప్పుడు ఆ ప్రాంతం డెవలప్ మెంట్ కు ఇచ్చారని, మరి అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలియదని మురళీ మోహన్ అన్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులకు ఆర్ధికంగా సలహాలు ఇచ్చిన ఘనత శోభన్ బాబుదే. సంపాదించిన ప్రతీ పైసా భూమి మీద పెట్టాలని, అది రెట్టింపు అవుతుందని శోభన్ బాబు తన తోటి నటులకు సలహాగా ఇచ్చేవారు. అలా ఆయన సలహాలు పాటించిన చాలామంది ఆర్ధికంగాబాగుపట్టారు. వారిలో మరళీ మోహన్ కూడా ఉన్నారు.
మురళీ మోహన్ తెలిపిన విషయం ప్రకారం, జయలలితకు హైదరాబాద్‌లో ఉన్న ఆ విలాసవంతమైన ఆస్తి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉందో తెలియదు. ఈ విషయం చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.


