|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Jayam Child Artist: గుడ్ న్యూస్ చెప్పిన ‘జయం’ మూవీ బాలనటి

Published: 24-10-2025, 7:44 AM
Jayam Child Artist: గుడ్ న్యూస్ చెప్పిన 'జయం' మూవీ బాలనటి

‘జయం’ సినిమాలో బాలనటిగా నటించి గుర్తింపు పొందిన యామిని శ్వేత శుభవార్త చెప్పింది. విదేశాల్లో స్థిరపడిన ఈ నటి రెండోసారి తల్లి కాబోతున్నట్లు దీపావళి సందర్భంగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

Key Points

1

'జయం' సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో యామిని శ్వేత నటించి గుర్తింపు పొందారు.

2

తన నటనకు గాను యామిని శ్వేత నంది అవార్డును కూడా అందుకుంది.

4

దీపావళి సందర్భంగా రెండోసారి తల్లి కాబోతున్నట్లు యామిని సోషల్ మీడియాలో ప్రకటించింది.

‘జయం’ బాలనటి యామిని శ్వేత ప్రస్థానం

‘జయం’ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీలో నటించిన హీరోహీరోయిన్‌తో పాటు మిగిలిన యాక్టర్స్, డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్ర చేసిన బాలనటి యామిని కూడా బాగానే క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరోసారి తల్లికాబోతున్నట్లు శుభవార్త చెప్పేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసింది.

సీరియల్, సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయలక్ష‍్మి కూతురే యామిని శ్వేత. ‘జయం’ సినిమాలో నటించడాని కంటే ముందు దాదాపు 10 సీరియల్స్‌లో చేసింది. సీతామహాలక్ష‍్మీ అనే సీరియల్‌ చేస్తున్న టైంలో ‘జయం’ ఆడిషన్స్ గురించి ప్రకటన వచ్చింది. ఇది చూసిన యామిని తండ్రి.. కూతురు ఫొటోలని డైరెక్టర్ తేజకు పంపారు. స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత యామిని.. హీరోయిన్ చెల్లి పాత్రకు ఎంపికైంది. తన నటనతో నంది అవార్డ్ కూడా అందుకుంది.

యామిని కెరీర్, ఉన్నత చదువులు, వ్యక్తిగత జీవితం

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మాత్రమే శ్వేత.. సినిమాల్లో కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో చిన్నప్పుడు పలు సినిమాలు, సీరియల్స్‌లో నటింపజేశారు. తర్వాత మాత్రం నో చెప్పేశారు. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు తదితర మూవీస్ చేసిన తర్వాత యామిని పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్‌ చేసి అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈమెకు ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు యామిని బయటపెట్టింది.

మరోసారి తల్లికాబోతున్న యామిని గుడ్ న్యూస్

దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యామిని.. ముగ్గురుగా ఉన్న తన కుటుంబం త్వరలో నలుగురిగా మారబోతుందని చెప్పింది. అలానే బేబీ బంప్ ఫొటోని కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘జయం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యామిని శ్వేత, ఇప్పుడు తన కుటుంబంలోకి కొత్త సభ్యుడి రాకను ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శుభవార్త పట్ల నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.