
📌 Key Points
- జయం రవి సంచలన నిర్ణయం: విడాకులు తేలే వరకు సినిమాల నుంచి బ్రేక్.
- భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం కోర్టులో, పిల్లలను చూడనీయడం లేదని ఆవేదన.
- ‘మూడక్షరాల ఇడ్లీ నటి’పై జయం రవి ఆగ్రహం, పర్సనల్ విషయాలపై హెచ్చరిక.
- ఆర్తి స్ట్రాంగ్ రిప్లై: “నిద్ర పోతున్న సింహాన్ని లేపొద్దు” అంటూ సంచలనం.
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా జయం రవి గురించే చర్చ! సంచలన నిర్ణయంతో అభిమానులను షాక్‌కు గురిచేశారు. తన పర్సనల్ లైఫ్‌లో ఎదురైన సమస్యలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం!
విడాకుల పంచాయితీ.. సినిమాలకు బ్రేక్!
రవి మోహన్(జయం రవి) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. విడాకుల సమస్య ముగిసే వరకు ఏ సినిమాలోనూ నటించనని స్పష్టం చేశారు. తనను వేధించడం, బెదిరించడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేరుగా తన ఆఫీస్‌కు రావొచ్చని సూచించారు.
తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు కోర్ట్ లో ఉంది. ఈ క్రమంలో తన పిల్లలను చూసేందుకు కూడా ఆమె అనుమతించడం లేదని రవి మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు చదివే స్కూళ్లకు సెక్యూరిటీ సిబ్బందిని పంపుతున్నారని, తన మొబైల్ కనెక్షన్ కూడా కట్ చేశారని ఆయన ఆరోపించారు.
ఆ ‘మూడక్షరాల నటి’పై జయం రవి ఫైర్!
సోషల్ మీడియాలో కెనీషాపై దాడులు జరిగాయని, అందుకే ఆమె వెళ్లిపోవాల్సి వచ్చిందని రవి మోహన్ చెప్పారు. ‘ఆమె ఎక్కడున్నా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. కెనీషా.. `ఇకపై అతను మీవాడు` అని పోస్ట్ పెట్టిన నేపథ్యంలో వీరిద్దరు విడిపోయినట్టు ప్రచారం జరిగింది. రవిమోహన్ ఆ విషయాన్ని స్పష్టంచేశారు. విడాకులు వచ్చే వరకు తన సినిమాలు విడుదల కావని, గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న అవమానాల వల్ల ఇక నటించలేనని స్పష్టం చేశారు.
సింహం నిద్ర లేచింది.. ఆర్తి స్ట్రాంగ్ రిప్లై!
కొంతమంది పీఆర్ టీమ్‌లను ఉపయోగించి సోషల్ మీడియాలో తనపై దాడి చేస్తున్నారని రవి మోహన్ ఆరోపించారు. ‘ఓ మూడక్షరాల ఇడ్లీ నటి ఉంది. ఆమె నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిందని ముగ్గురు నటులు నాతో చెప్పారు. అలాంటిది నా గురించి మాట్లాడుతోంది. నా పర్సనల్ లైఫ్ గురించి ఇంకోసారి మాట్లాడితే బాగోదు. నా గురించి మాట్లాడే అర్హత నీకేముంది?’ అని ఆ నటిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ఆమె ఖుష్బూ అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో దీనిపై రవి మోహన్ భార్య ఆర్తి స్పందించారు. `నిద్ర పోతున్న సింహాన్ని లేపొద్దు` అని వెల్లడించింది. ఇది రవిని ఉద్దేశించే అని అంటున్నారు. ఏదేమైనా జయం రవి ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. తన భార్యా విడాకులు ఇస్తోంది, మరోవైపు తన ప్రియురాలు వెళ్లిపోయింది. దీంతో ఒంటరైపోయాడు రవి.
జయం రవి జీవితంలో జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి. ఆయన త్వరగా అన్ని సమస్యల నుండి బయటపడి మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్, ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!


