
📌 Key Points
- జేడీ చక్రవర్తి ఓ ‘మహాభావుడి’ అసలు రంగు బయటపెట్టారు.
- ఆ హీరో తన భార్యను వదిలిపెట్టి గర్ల్‌ఫ్రెండ్‌తో కాపురం పెట్టినట్లు జేడీ వెల్లడించారు.
- షూటింగ్‌కు తాగి వచ్చి ఆలస్యంగా వస్తాడని జేడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- జేడీ ఇచ్చిన హింట్స్‌తో నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు.
జేడీ చక్రవర్తి తన కొత్త చిత్రం ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో ‘మహాభావుడు’ అనిపించుకునే ఓ స్టార్ హీరో వ్యక్తిగత జీవితంపై జేడీ బయటపెట్టిన నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
జేడీ సంచలన కామెంట్స్: ‘మహాభావుడి’ బండారం!
JD Controversy : జేడీ చక్రవర్తి….నేను గనుక నోరు తెరిచానంటే నెట్టింట్లో మంటలే అన్నట్టుగా ఉంది ఈయన గారి వాలకం.మొన్నటికి మొన్న ఒక ముసలి ప్రొడ్యూసర్ చీకటి కోణాన్ని ఆవిష్కరించిన జేడీ తాజాగా సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరో అసలు రంగుని బయటపెట్టేశాడు.
అగ్గి రాజేస్తున్న కామెంట్స్
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో, తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ‘గాయపడ్డ సింహం’ (Gaaya Padda Simham) సినిమాలో ‘బ్రూటల్ ధర్మ’ కీలకపాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా రేపే అంటే మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో హోరేత్తిస్తున్నాడు జేడీ. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయ్.
అసలు విషయాలు తెలిసి మైండ్ బ్లాక్
జేడీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహానుభావుడు అని చెప్పుకునే ఒక హీరోకి చాలా రెస్పెక్ట్ ఇస్తానని,కాని అతడి గురించి అసలు విషయాలు తెలిసి నా మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కి తను లేట్ గా ఎందుకొస్తారని కనుక్కుంటే అతను రాత్రి బాగా తాగుతాడని, ఆమత్తు దిగకపోవడం వల్లే అలా లేట్ గా వస్తారని చెప్పడంతో షాక్ అయ్యానని తెలిపారు.అసలు అంత స్టార్ డమ్ ఉండి ఈ వయసులో అలా రెస్పాన్సిబులిటీ లేకుండా ఉండటం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.
భార్యను వదిలి గర్ల్‌ఫ్రెండ్‌తో కాపురం: అసలు నిజాలు
భార్యని వదిలి గర్ల్ ఫ్రెండ్ తోనే కాపురం
ఇక అంతేకాదని ఆ మహానుభావుడు తన భార్యని వదిలిపెట్టి గర్ల్ ఫ్రెండ్ తోనే కాపురం పెట్టేశాడని, హోటళ్ళలో కూడా ఉండట్లేదన్న విషయం తెల్సి స్టన్ అయ్యానని తెలిపాడు. పేరుకేమో పెద్ద హీరో, నోరు తెరిస్తే చెవులకి చిల్లులు పడేలా సూక్తులని చెప్పే ఈ మహానుభావుడికి ఇంత వీక్ నెస్ ఉండటం ఏంటో అంటూ వాపోయాడు జేడీ. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ మహానుభావుడి పేరు చెప్పకపోయినా జేడీ ఇచ్చిన హింట్స్ బట్టి ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.
ఇక జేడీ చక్రవర్తి విషయానికి వస్తే ఈయన అసలు పేరు గులివాడ చక్రవర్తి. 1989 లో శివలో జేడీ గా నటించి ఆ పేరుతోనే ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు.ఇక 90s లో ఆయన కెరీర్ మంచి పీక్ చూసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన చేసిన ‘మనీ’, ‘గులాబి’, ‘అనగనగా ఒక రోజు’ వంటి సినిమాలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి.ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ముంబై వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘సత్య’ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.
ఇక నటనతో పాటు మెగా ఫోన్ పట్టి ‘హోమం’, ‘సిద్ధం’ వంటి క్రైమ్ థ్రిల్లర్లతో డైరెక్టర్ గానూ నిరూపించుకున్నాడు.ఇక 2016లో నటి అనుకృతి శర్మను పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.
తాగిన మైకంలో సెట్స్‌కి వచ్చే హీరో ఎవరు?
చూడాలి మరి ఇప్పటికే వరుస కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో వైరల్ అవుతున్న జేడీ ముందు ముందు ఇంకెన్ని మంటల్ని రాజేస్తాడో ! ఇది కూడా
Huge controversy!!!! pic.twitter.com/NZCOl6wIzn
— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 29, 2026
జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ‘మహాభావుడు’ ఎవరనేది రహస్యంగా ఉన్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. జేడీ ధైర్యానికి అభినందనలు.


