
ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపేజ్ తన తాజా అవార్డ్ ఫంక్షన్ పెర్ఫార్మెన్స్‌లో ఆడ, మగ తేడా లేకుండా అందరితో లిప్ కిస్సులు పెట్టుకుని వైరల్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
Key Points
జెన్నీఫర్ లోపేజ్ స్టేజీపై అందరికీ లిప్ కిస్సులు ఇచ్చింది.
ఆడ, మగ తేడా లేకుండా అందరితో ముద్దులు పెట్టుకుంది.
నెటిజన్లు వివిధ రకాల ప్రతిస్పందనలు ఇస్తున్నారు.
జెన్నీఫర్ లోపేజ్ వైరల్ వీడియో
హాలీవుడ్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్ అరవై ఏళ్లు మీద పడుతున్నా ఇరవై ఏళ్ల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇప్పటికీ అదే క్రేజ్ మెయింటెన్ చేస్తోంది. ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు, భరణాల విషయంలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె.. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో అదిరిపోయే స్టెప్స్ వేసింది. అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో వెంటనే వైరల్ అయిపోయింది. కారణం ఆమె చేసింది నార్మల్ డ్యాన్స్ కాదు. ఏకంగా కో డ్యాన్సర్స్ అందరికీ లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ పోయింది. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ స్టేజీపైనే ముద్దులు పెట్టింది.
స్టేజీపై లిప్ కిస్సులు
ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు.. ఏంటీ ఈ నాన్సెన్స్ అని తిట్టిపోస్తున్నారు. అందుకే హాలీవుడ్ షోస్ అంటే నచ్చదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం కొంచెం డీప్‌గానే స్పందించారు. ఆమె రియల్ స్టేట్ ఆఫ్ మైండ్‌లో లేదని కొందరు అంటుంటే.. డీప్ లిప్ కిస్సులతో వైరస్ స్ప్రెడ్ చేస్తుందని మరికొందరు అంటున్నారు. బరితెగించిన ప్రవర్తనను చూస్తే వాంతులు వస్తున్నాయని ఎమోజీలతో రిప్లయ్ ఇస్తున్నారు.
నెటిజన్ల స్పందనలు
A post shared by Heather Collins (@radioheather)
జెన్నీఫర్ లోపేజ్ ప్రవర్తనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఆమె ప్రవర్తనను సమర్థిస్తున్నారు. ఈ ఘటన హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


