|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన జాలీ ఓ జింఖానా కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!

Published: 15-05-2025, 7:49 AM
నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన జాలీ ఓ జింఖానా కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!

ప్రముఖ నటుడు ప్రభుదేవా నటించిన ‘జాలీ ఓ జింఖానా’ అనే కామెడీ థ్రిల్లర్ సినిమా ఇవాళ ఆహా ఓటీటీలో తెలుగులో విడుదలైంది. నలుగురు ఆడవాళ్లు చేసిన బ్యాంక్ స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

Key Points

1

ప్రభుదేవా నటించిన 'జాలీ ఓ జింఖానా' కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి!

2

నలుగురు ఆడవాళ్లు చేసిన బ్యాంక్ స్కామ్ కథాంశం ఆధారంగా రూపొందించబడింది.

4

నేటి నుండి (మే 15) ఆహా ఓటీటీలో 'జాలీ ఓ జింఖానా' చూడండి!

జాలీ ఓ జింఖానా: కథానకం

ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు అలరించడానికి ప్రతివారం సిద్ధంగా ఉంటున్నాయి. తాజాగా ఇవాళ మే (15) ఓ కోలీవుడ్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే జాలీ ఓ జింఖానా. నేటి నుంచి తెలుగు భాషలో జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా మెయిన్ లీడ్ రోల్ చేశాడు. అలాగే, హీరోయిన్స్‌గా మడోన్నా స్టెబాస్టియన్, పూజిత పొన్నాడ నటించారు. సీనియర్ హీరోయిన్ (చెప్పవే చిరుగాలి) అభిరామి, పాపులర్ కమెడియన్ యోగిబాబు , రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో అలరించారు.

శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన జాలీ ఓ జింఖానా సినిమా డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. నలుగురు ఆడవాళ్లు కలిసి ఓ శవంతో బ్యాంక్ స్కామ్ ఎలా చేశారనే కాన్సెప్ట్‌తో కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా జాలీ ఓ జింఖానా సినిమాను రూపొందించారు మేకర్స్.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

గతేడాది 2024లో నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన జాలీ ఓ జింఖానా సినిమాకు టాక్ బాగానే వచ్చింది. దాంతో ఐఎమ్‌డీబీ నుంచి పది పాయింట్లకు 7.5 రేటింగ్ సాధించుకుంది ఈ మూవీ. అలాంటి జాలీ ఓ జింఖానా మూవీ ఇవాళ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహాలో జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నవ్వుల పండుగను మిస్ కాకండి అంటూ మేకర్స్ ప్రకటన అనౌన్స్ చేశారు. భవానీ మీడియా ద్వారా ఆహాలో నేటి నుంచి (మే 15) జాలీ ఓ జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది.

ఇక జాలీ ఓ జింఖానా కథ విషయానికొస్తే.. తంగ‌సామి త‌న కూతురు చెల్ల‌మ్మ‌ (అభిరామి), మ‌న‌వ‌రాళ్లు భ‌వానీ, య‌జానీ, శివానీ (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) తో క‌లిసి హోట‌ల్ రన్ చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు లోక‌ల్ ఎమ్మెల్యేతో చెల్లమ్మ గొడవ పెట్టుకుంటుంది. తంగ‌సామిని ఆ ఎమ్మెల్యే మ‌నుషులు కొట్ట‌డంతో హాస్పిట‌ల్ పాల‌వుతాడు.

ఓటీటీ విడుదల వివరాలు

తంగ‌సామికి ఆప‌రేష‌న్ చేయాల‌ని అందుకు రూ. 25 ల‌క్ష‌లు కట్టాలని డాక్ట‌ర్లు చెబుతారు. ఇంతలో స‌డెన్‌గా వారి బ్యాంకు అకౌంట్‌లో ఆప‌రేష‌న్‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు డిపాజిట్ అవుతుంది. ఆ డ‌బ్బుతో తంగ‌సామిని బ‌తికించుకుంటారు చెల్ల‌మ్మ‌, ఆమె కూతుళ్లు.

ఆ డబ్బు ఎవరిది? చెల్లమ్మతో పాటు తన కూతుళ్ల వెంట ఎమ్మెల్యె రోడీలు ఎందుకు పడ్డారు?. డబ్బు కోసం ఓ శవంతో బ్యాంక్ స్కామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్, కామెడీ విషయాలు తెలియాలంటే ఆహా లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న జాలీ ఓ జింఖానా సినిమాను చూడాల్సిందే.

7.5 IMDB రేటింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ‘జాలీ ఓ జింఖానా’ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ నవ్వుల పండుగను మిస్‌ చేసుకోకండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.