|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ! హీరోయిన్లకు గట్టి పోటీ!

Published: 29-03-2026, 3:05 PM
మాస్ స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ! హీరోయిన్లకు గట్టి పోటీ!
  • శ్రీలీల, తమన్నా, సమంత, పూజా హెగ్డే జాబితాలో చేరిన జోనితా గాంధీ!
  • అడివి శేష్‌తో కలిసి చిచ్చు బుడ్డి సాంగ్‌లో జోనితా స్టెప్పులు అదుర్స్!
  • ‘డెకాయిట్’ సినిమాలో రామ్ మిర్యాలతో కలిసి పాడిన జోనితా గాంధీ.
  • ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా ఉందంటూ యూనిట్ సభ్యుల ప్రశంసలు!

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం! సింగర్ జోనితా గాంధీ ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది. అడివి శేష్‌తో కలిసి తన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ మూవీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

చిచ్చు బుడ్డి సాంగ్‌తో జోనితాకు క్రేజ్!

Singer Jonita Gandhi After Sreeleela Tamanna Samantha: స్టార్ హీరోయిన్లు శ్రీలీల, సమంత, తమన్నా, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, కాజల్ సరసన చేరిపోయింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. అడవి శేష్‌తో కలిసి చిచ్చు బుడ్డి సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసింది. అలా జోనితాకి విపరీతమైన క్రేజ్ పెరిగింది.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త మ్యాజిక్ జరగబోతోంది. ‘వాట్ ఝుమ్కా?’, ‘సోనీ సోనీ’, ‘మా మా మహేషా’ వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు తన గళంతోనే కాదు, తన డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను మాయ చేసింది.

అడివి శేష్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది!

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ డెకాయిట్ ‘ (Dacoit) లో జోనితా గాంధీ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటను రామ్ మిర్యాలతో కలిసి పాడటమే కాదు అడవి శేష్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది బ్యూటిపుల్ సింగర్ జోనితా గాంధీ. దీంతో జోనితా గాంధీ పేరు మారుమోగిపోతింది.

టాలీవుడ్‌లో జోనితా మ్యాజిక్ స్టార్ట్!

అడివి శేష్ వంటి గ్రేస్ ఉన్న హీరోతో పోటీ పడి డ్యాన్స్ చేయడానికి జోనితా చాలా రోజుల పాటు కఠినంగా ప్రాక్టీస్ చేశారని సమాచారం. స్క్రీన్ మీద ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే, ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

జోనితా గాంధీ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తన డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.