|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ: ‘వార్ 2’ ఎఫెక్ట్! ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు!

Published: 09-02-2026, 2:05 AM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ: 'వార్ 2' ఎఫెక్ట్! ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
  • ‘వార్ 2’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన ప్రాజెక్టుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు.
  • మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.
  • ఎన్టీఆర్ కొత్త లుక్ నీల్ సినిమా కోసమే అని అభిమానులు భావిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న కారణంగా ఈ మార్పులు అనివార్యమయ్యాయి. ఫస్ట్ లుక్ మే 20న విడుదల కానుంది.

ఎన్టీఆర్ నీల్ మూవీలో స్క్రిప్ట్ మార్పులు

Jr NTR Neel Movie: ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న క్రేజీ కాంబినేషన్ ప్రశాంత్ నీల్ సినిమా. అయితే, ఈ సినిమా షూటింగ్, స్క్రిప్ట్ విషయంలో మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ ప్రశాంత్ నీల్ సినిమా కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, మధ్యలో ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ‘వార్ 2’ అప్‌డేట్స్ మరియు అవుట్‌కమ్ తర్వాత, ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై మరింత కసరత్తు చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగినట్లుగా, అంచనాలను అందుకునేలా కథలో కొన్ని కీలక మార్పులు చేసి, టీమ్ మరింత పక్కాగా సిద్ధమైంది.

Read also- Aadarsha Kutumbam Ak 47: వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై పెరుగుతున్న హైప్..రిలీజ్ ఎప్పుడంటే..?

‘వార్ 2’ ప్రభావం

బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే?

నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ గతేడాది మే నెలలోనే వస్తుందని అందరూ భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయితే, ఈ ఏడాది మే 20న (ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా) ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈసారి మాత్రం అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాలిడ్ కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇక ఇటీవలి ఎన్టీఆర్ మేకోవర్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. చాలా షార్ప్‌గా, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తున్న ఆయన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త లుక్ నీల్ సినిమా కోసమే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ నీల్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు.

మే 20న ఫస్ట్ లుక్ విడుదల

Read also- February 14 Movies: లవర్స్ డే స్పెషల్.. ఈవారం రీ రిలీజ్ , కొత్త సినిమాల సందడి..

మొత్తానికి ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. దీనికి ‘వార్ 2’ చిత్రం మరింత బలాన్ని చేకూర్చింది. మే 20 కోసం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.