
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో మరియు యూఎస్ కాన్సులేట్ సందర్శనం వార్తల్లో నిండి ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ కష్టపడుతున్నారని తెలుస్తోంది.
Key Points
జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కౌట్స్‌తో స్లిమ్ లుక్‌లో కనిపించారు.
ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సినిమా అమెరికాలోనూ షూట్ అవుతుందని సూచనలు ఉన్నాయి.
జిమ్ వర్కౌట్స్ మరియు స్లిమ్ లుక్
జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒకే రోజు రెండు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకటి అతడు జిమ్ లో వర్కౌట్ చేస్తూ స్లిమ్ లుక్ లో కనిపించగా.. మరోవైపు మంగళవారం (సెప్టెంబర్ 16) అమెరికా కాన్సులేట్ లోనూ అతడు కనిపించడం విశేషం. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే తారక్ ఇలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యే వార్ 2 మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ లో అతడు బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే అతడు పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యుఎస్ కాన్సులేట్ సందర్శనం
ఇందులో అతడు చాలా సన్నగా కనిపించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో బొద్దుగా ఉన్న అతడు.. యమదొంగ మూవీ సమయంలో ఇలాగే సన్నగా మారిపోయాడు. మళ్లీ కాస్త లావెక్కినా.. ఇప్పుడు మరోసారి చాలా సన్నగా కనిపించి ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే అతని బైసెప్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అతడు వాటిపైనే ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక మంగళవారమే (సెప్టెంబర్ 16) తారక్ యూఎస్ కాన్సులేట్ కు కూడా వెళ్లాడు. ఈ విషయాన్ని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తన అఫీషియల్ అకౌంట్ ద్వారా వెల్లడించడం విశేషం. “కాన్సులేట్‌కు తారక్ కు స్వాగతం పలకడం ఎక్సైటింగా ఉంది.
ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్స్
అతని రీసెంట్, రాబోయే సినిమాలను యునైటెడ్ స్టేట్స్ లో షూట్ చేయడం ఇండియా, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న భాగస్వామ్యం శక్తి ఏంటో చూపిస్తోంది. అంతేకాదు ఇది ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి, సంబంధాలు మరింత పటిష్టమవడానికి ఉపయోగపడతాయి” అని ఆమె అనడం గమనార్హం. ప్రశాంత్ నీల్ మూవీని అమెరికాలోనూ షూట్ చేయనున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ మరియు అమెరికా కాన్సులేట్ సందర్శనం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.


