|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం! ఎన్టీఆర్ సంచలన మేకోవర్!!

Published: 16-04-2026, 4:35 AM
షాకింగ్: 7 వారాల్లో 9.5 కిలోలు మాయం! ఎన్టీఆర్ సంచలన మేకోవర్!!
  • 7 వారాల్లో 9.5 కిలోల బరువు తగ్గి కండలు తిరిగిన ఎన్టీఆర్ లుక్ వైరల్! ఇది డ్రాగన్ చిత్రం కోసం చేసిన మేకోవర్.
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ తీసుకుంటున్నారు.
  • తారక్ ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్న అభిమానులు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
  • లో-ప్రోటీన్ డైట్, ఫంక్షనల్ ట్రైనింగ్‌తో ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇది అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్.

జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్‌నెస్‌తో మరోసారి టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. ఆయన డ్రాగన్ చిత్రం కోసం చేసిన మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

7 వారాల్లో సంచలన మార్పు

ఒక హీరో ఫిజికల్ మేకోవర్ అయితే, ఆ టాపిక్ వెంటనే వైరల్ అవుతుంది. ముఖ్యంగా, ఒక రకమైన ఇమేజ్‌తో కనిపించిన నటుడు ఉన్నట్టుండి సన్నగా, షార్ప్‌గా కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. తారక్ తన లుక్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటై అభిమానులకు షాక్ ల మీద షాకులిస్తున్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొత్త ఫోటో చూసి జనం అవాక్కవుతున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా షాకింగ్‌గా ఉంది.

డ్రాగన్ కోసం తారక్ కష్టం

ఈ ఫోటో చాలా సింపుల్‌గా ఉన్నా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో ఎన్టీఆర్ డబుల్-బైసెప్స్ పోజ్‌లో వెనక నుంచి కనిపిస్తున్నారు. వీపు, చేతులు, భుజాలు… అన్నీ చాలా టైట్‌గా, కండలు తిరిగినట్టు స్పష్టంగా ఉన్నాయి.

ఆయన లేత గ్రే రంగు ట్రైనింగ్ షార్ట్స్‌తో జిమ్‌లో నిలబడి ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా బ్లర్‌గా ఉన్నా, జిమ్ పరికరాలు కనిపిస్తున్నాయి. ‘కొన్నది కాదు. కష్టపడి సంపాదించింది’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు.

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫిట్‌నెస్

జూనియర్ ఎన్టీఆర్  ట్రైనర్ కుమార్ మన్నవ చెప్పిన  ప్రకారం, ఎన్టీఆర్ కేవలం ఏడు వారాల్లో 9.5 కిలోల కండరాలను తగ్గించుకున్నారు. కొవ్వు కాదు, కండరాలు! డెక్కన్ క్రానికల్ సమాచారం ప్రకారం, ఈ పాత్ర కోసం సన్నగా, చురుకైన  బాడీ అవసరం. అందుకే భారీ కండలు పెంచే వర్కౌట్లు తగ్గించి, ఫంక్షనల్ ట్రైనింగ్, కార్డియో, మోస్తరు రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌లపై దృష్టి పెట్టారు.

ట్రైయినర్ మాట్లాడుతూ… ఆయన షెడ్యూల్ చాలా టైట్‌గా ఉండేది. రోజూ ఉదయాన్నే 45 నుంచి 90 నిమిషాల పాటు కఠినంగా శ్రమించేవారు. డైట్‌లో కూడా భారీ మార్పులు చేశారు. కండలు పెంచే హై-ప్రోటీన్ డైట్‌కు బదులుగా, లో-ప్రోటీన్ డైట్ తీసుకున్నారు. ఇది ఆయన కండరాలను తగ్గించడంలో సహాయపడింది. వినడానికి సింపుల్‌గా ఉన్నా, ఏడు వారాల పాటు ఈ క్రమశిక్షణ పాటించడం చాలా కష్టం. ఆ కష్టానికి ఫలితమే ఈ ఫోటో.

ఎన్టీఆర్ తన అంకితభావంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.