
వైదిక జ్యోతిష్యం ప్రకారం, జూన్ 29 వరకు శుక్రుని ధన శక్తి రాజయోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చిక, కర్కాటక, మిధున రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి.
Key Points
వృశ్చిక, కర్కాటక, మిధున రాశుల వారికి ధన లాభాలు.
జూన్ 29 వరకు శుక్రుని ధన శక్తి రాజయోగం.
ఆరోగ్యం, కుటుంబ సంతోషం పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి శుభ సూచనలు
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు గత నెలలో కుజుడు రాశి అయినటువంటి మేష రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 29 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడంతో ధన శక్తి రాజయోగం జూన్ 29 వరకు ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి అదృష్టం కలగనుంది.
జూన్ 29 మధ్యాహ్నం శుక్రుడు వృషభ రాశి లోకి ప్రవేశిస్తాడు. ఈ ధన శక్తి రాజయోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
వృశ్చిక రాశి వారికి ధన శక్తి యోగం అనేక విధాలుగా సహాయపడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా సమస్యల నుంచి బయటపడతారు. ధన శక్తి రాజయోగం సంపద ద్వారాలను తెరుస్తుంది. జూన్ 29 వరకు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు
ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారి అందం కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెడతారు. వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి గౌరవం కూడా పెరుగుతుంది.
మిధున రాశి వారికి ఉద్యోగ, కుటుంబ సంతోషం
మిధున రాశి వారికి ధన శక్తి రాజయోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారి పిల్లలు సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం సూచనార్థమే. నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శుభం!


