
జూన్ నెలలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో బ్లాక్‌బస్టర్ సినిమాల వరద పారుతోంది. మోహన్ లాల్, శ్రీవిష్ణు, సూర్య నటించిన సూపర్ హిట్ చిత్రాలు ఈ నెలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వివరాలు తెలుసుకుందాం.
Key Points
మోహన్ లాల్ 'తుడరం' జూన్ లో ఓటీటీలో!
శ్రీవిష్ణు 'సింగిల్' అమెజాన్ ప్రైమ్ లో!
సూర్య 'రెట్రో' ఓటీటీ రిలీజ్ తేదీ త్వరలో!
'టూరిస్ట్ ఫ్యామిలీ' జియో సినిమాలో స్ట్రీమింగ్!
టాప్ 5 ఓటీటీ రిలీజ్ లు
జూన్ నెలలో వివిధ ఓటీటీల్లో బ్లాక్‍బస్టర్ సినిమాల జాతర ఉండనుంది. థియేట్రికల్ రన్‍తో సూపర్ హిట్ అయిన ఐదు చిత్రాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. మోహన్‍లాల్ తుడురమ్ చిత్రం ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. రెండు తమిళ బ్లాక్‍బస్టర్స్ కూడా వచ్చేయనున్నాయి. జూన్‍లో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు ఇవే..
తమిళ సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ భారీ హిట్ సాధించింది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. మే 1న థియేటర్లలో విడుదలైంది. రూ.16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.75కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రానికి అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ తొలి వారంలో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది.
తుడరం, సింగిల్, రెట్రో విడుదల వివరాలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన తుడరమ్ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. రూ.30కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.200కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి బంపర్ బ్లాక్‍బస్టర్ కొట్టింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ 26న థియేటర్లలో విడుదలైంది. అంచనాలను మించి సక్సెస్ సాధించింది. తుడరమ్ సినిమా జూన్‍లోనే జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ‘సింగిల్’ సూపర్ హిట్ కొట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం మే 9న విడుదలైంది. సుమారు రూ.10కోట్ల బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు రూ.26కోట్ల కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్షన్ చేశారు. సింగిల్ సినిమా జూన్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. జూన్ తొలివారం లేకపోతే రెండో వారం ఎంట్రీ ఇస్తుంది.
జూన్ నెలలో ఓటీటీ ఎంటర్టైన్మెంట్
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్మరేపింది. ఈ సినిమా రూ.200కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. రూ.70కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ యాక్షన్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా చేశారు. రెట్రో సినిమా జూన్‍లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తొలి వారమే స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.
మలయాళ స్పోర్ట్స్ కామెడీ మూవీ ‘అలప్పుజ జింఖానా’ కూడా బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. నెస్లన్ గఫూర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజైంది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ రూ.50కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీకి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు. అలప్పుజ జింఖానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో జూన్‍లోనే స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది.
చివరగా, జూన్ నెల ఓటీటీ ప్రేమికులకు పండగే. ఈ సూపర్ హిట్ చిత్రాలతో మీ ఇంటినే సినిమా హాల్ గా మార్చుకోండి!


