
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన ‘జూనియర్’ సినిమా రివ్యూ ఇది. శ్రీలీల, జెనీలియాతో కలిసి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ, నటన, సంగీతం గురించి వివరణ ఇందులో ఉంది.
Key Points
కిరీటి రెడ్డి అరంగేట్రం సినిమా 'జూనియర్' రివ్యూ
శ్రీలీల, జెనీలియా నటన ఎలా ఉందో తెలుసుకుందాం
కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా సక్సెస్ అవుతుందా?
కథ, దర్శకత్వం, నటన విశ్లేషణ
కథానకం మరియు పాత్రలు
నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, రావు రమేష్, అచ్యుత్ కుమార్, సత్య, వైవా హర్ష, సుధారాణి తదితరులు
కథ, దర్శకత్వం: రాధా కృష్ణారెడ్డి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే
కిరీటి రెడ్డి నటన
విడుదల తేది: జులై 18, 2025
ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా జూనియర్. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేయగా సీనియర్ హీరోయిన్ జెనీలియా చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. వైరల్ వయ్యారి సాంగ్‌తో శ్రీలీల , కిరీటి ఇద్దరు అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో జూనియర్ రివ్యూ లో తెలుసుకుందాం.
విజయనగరంలో కోదండపాణి (రవిచంద్రన్), శ్యామలకు 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. దాంతో తండ్రి అతి గారాబంగా కొడుకును పెంచుతాడు. తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి (కిరీటి రెడ్డి) దూరంగా వెళ్లి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. మనకంటూ మంచి జ్ఞాపకాలు ఉండాలంటూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు.
ఈ క్రమంలో స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడిన అభి నాలుగేళ్ల తర్వాత ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆ కంపెనీ సీఈఓ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కు అభి అంటే పడదు.
అభి అంటే విజయకు ఎందుకు పడదు? విజయ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అన్న కూడా ఎందుకు నచ్చదు? అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తండ్రి కోదండపాణి నేపథ్యం ఏంటీ? అసలు స్ఫూర్తి ప్రేమను అభి పొందాడా? అనేది తెలియాలంటే ఈ జూనియర్‌ను చూడాల్సిందే.
సినిమా బలహీనతలు మరియు బలాల
జూనియర్ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోను పరిచయం చేసే సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు జూనియర్‌లో ఉన్నాయి. హీరోయిన్ నుంచి టెక్నీషియన్స్ వరకు అంతా టాప్‌లో ఉన్నవారే. అయితే, వారందరికి మ్యాచ్ అయ్యేలా ఆ డెబ్యూ హీరో ఆకట్టుకున్నాడా అనేది ప్రధానంగా వచ్చే ప్రశ్న.
ఆ ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం ఇచ్చాడు కిరీటి రెడ్డి. జూనియర్ సినిమా టెంప్లెట్ అంతా రొటీన్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. ఫస్టాఫ్ అంతా ఒక డెబ్యూ హీరోతో చేయించాల్సిన కామెడీ, ఫైట్స్, డ్యాన్స్ అన్ని చేయించారు. వాటన్నింటిలో కిరీటి రెడ్డి ఇరగదీశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా డ్రామా స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గానే సాగుతుంది.
అది బాగానే వర్కౌట్ అయింది. సినిమా కథ రొటీన్‌గా ఉన్న కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతునే సక్సెస్ అవుతుంది. దాంట్లో జూనియర్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగానే పండాయి. ఇక నిర్మాణ విలువలు, దేవి శ్రీ సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి.
వైరల్ వయ్యారి సాంగ్‌లో శ్రీలీలకు తగ్గాఫర్ పోటీ ఇచ్చిన కిరీటి రెడ్డి అన్నింట్లో మెప్పించాడు. తొలి సినిమా అయిన చాలా కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. చుట్టూ అంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా ఎలాంటి బెరుకులేకుండా అలరించాడు. ఇక శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసింది. పాత్రకు పెద్దగా స్కోప్ లేదనిపించింది.
జెనీలియా సీరియస్ టోన్‌లో బాగా చేసింది. హా హా హాసిని అంటూ జోవియల్‌గా గుర్తుండిపోయిన జెనిలీయా సీరియస్ రోల్‌లో కూడా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలు సైతం మెప్పించాయి. డైరెక్టర్ రాధా కృష్ణారెడ్డి టేకింగ్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కిరీటి వన్ మ్యాన్ షోతో నిండిపోయిన జూనియర్.
మొత్తం మీద, ‘జూనియర్’ సినిమా ఒక సగటు కమర్షియల్ ఎంటర్‌టైనర్. కిరీటి రెడ్డి డెబ్యూ బాగుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్.


