
📌 Key Points
- మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితులకు ఎర్నాకుళం కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించింది.
- న్యాయం కోసం నటి 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల సుదీర్ఘ, బాధాకరమైన పోరాటం చేసింది.
- తీర్పు అనంతరం నటి భావోద్వేగ పోస్ట్ పెట్టగా, కాస్త ఉపశమనం లభించిందని పేర్కొంది.
- పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్ వంటి స్టార్ నటీనటులు నటి పోస్ట్‌కు మద్దతు తెలిపారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన నటి లైంగిక వేధింపుల కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఎనిమిదేళ్ల పోరాటం తర్వాత నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బాధిత నటి భావోద్వేగ పోస్ట్ పెట్టగా, పృథ్వీరాజ్, మంజు వారియర్ వంటి ప్రముఖులు మద్దతుగా నిలిచారు.
8 ఏళ్ల పోరాటం: నటి ప్రయాణం, తీర్పు
Kerala Actress Case: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మలయాళ ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటిని కొంతమంది ఆకతాయిలు లైగిక వేధింపులకు గురి చేశారు. ఆ కేసు కోర్టుకు వెళ్లడంతో పెండింగ్ లపైనా పెండింగులు పడుతూ వస్తోంది. కానీ, బాధిత నటి మాత్రం(Kerala Actress Case) వెనుకడుగు వేయలేదు. న్యాయం కోసం తన పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ కేసు కొలిక్కి వచ్చింది. నిందితులకు ఎర్నాకుళం సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. దీంతో బాధిత నటి ఆనందం వ్యక్తం చేసింది.
భావోద్వేగ పోస్ట్: నటి ఆనందం, ఉపశమనం
Shriya Saran: తల్లైనా తగ్గేదే లే.. గ్లామర్ డోస్ పెంచేసిన స్టార్ బ్యూటీ శ్రియా.. ఫోటోలు
స్టార్ల మద్దతు: పృథ్వీరాజ్, మంజు వారియర్ రియాక్షన్
అదే విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. “ఇది 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ఈ ప్రయాణం. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగినట్టుగా అనిపిస్తోంది”అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నటి చేసిన ఈ పోస్ట్ కి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రియాక్ట్ అయ్యాడు. ఆమె చేసిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ దండం పెట్టె ఎమోజీని యాడ్ చేశాడు. అంతేకాదు, మలయాళ నటి మంజు వారియర్ కూడా బాధిత నటి పోస్ట్ కి రియాక్ట్ అయ్యింది. ఇక తాజాగా వచ్చిన తీర్పుతో బాధిత నటి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
ఈ కేసు తీర్పుతో నటి సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు లభించింది. న్యాయంపై ఆమెకున్న నమ్మకం, ధైర్యం ఎందరికో ఆదర్శం. సినీ ప్రముఖుల మద్దతుతో ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇది సమాజంలో మార్పునకు నాంది పలికినట్టే.


