
కిరణ్ అబ్బవరం నటించిన ‘K-ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీపావళికి విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ఈ సినిమా విజయంపై చర్చలు జరుగుతున్నాయి.
Key Points
కిరణ్ అబ్బవరం 'K-ర్యాంప్' చిత్రం దీపావళికి విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
తక్కువ బడ్జెట్‌తో వచ్చి కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి.
K-ర్యాంప్: దీపావళి విజేతగా నిలిచిన కిరణ్ అబ్బవరం
దిశ, వెబ్ డెస్క్: కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయారు. దీపావళి వచ్చిందంటే చాలు.. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అందుకుంటున్నాడు. గత దీపావళికి క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ఈసారి కే-ర్యాంప్ తో ( K-Ramp) దుమ్ము లేపాడు. మొన్న 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ను కుమ్మేస్తోంది. ఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ, దీపావళి విన్నర్ గా మాత్రం కిరణ్ అబ్బవరం నిలిచాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 17.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలారు. అంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందన్నమాట. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా గొప్ప విషయం అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కథ ఉన్న నేపథ్యంలో జనాలు థియేటర్లకు భారీగా వెళ్తున్నారట. దీంతో కే-ర్యాంప్ ఆడుతున్న థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం చేయగా యుక్తి తరేజా ( Yukti Thareja) హీరోయిన్ గా మెరిశారు. నరేష్ లాంటి ప్రముఖ నటీనటులు కూడా ఇందులో మెరిశారు.
మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్
యూత్, ఫ్యామిలీలను ఆకట్టుకుంటున్న K-ర్యాంప్
మొత్తంగా, ‘K-ర్యాంప్’ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచిన ఈ సినిమా, తక్కువ బడ్జెట్‌తో వచ్చి పెద్ద విజయం సాధించడం గమనార్హం. ఈ సక్సెస్ కిరణ్ స్టార్‌డమ్‌ను మరింత పెంచుతుంది.


