
కిరణ్ అబ్బవరం మరియు యుక్తి తరేజా జంటగా నటిస్తున్న ‘కె-ర్యాంప్’ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజీ పోస్టర్ విడుదలైంది. జూలై 14న గ్లింప్స్ విడుదల కానుంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
Key Points
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా ‘కె-ర్యాంప్’ సినిమా
జూలై 14న గ్లింప్స్ రిలీజ్
లుంగీలో కిరణ్ అబ్బవరం ఆకర్షణీయమైన లుక్
కె-ర్యాంప్ గ్లింప్స్ రిలీజ్ డేట్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukti Thareja) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’(K-Ramp). ఈ సినిమాను జైన్స్ నాని(Jains Nani) డైరెక్ట్ చేస్తుండగా హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా రీసెంట్‌గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ జూలై 14న రిలీజ్ చేస్తున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా ప్రకటించారు.
ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరో క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు అని రాసుకొస్తూ పోస్ట్ పెట్టారు. ఇక పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని చేతిలో మందు బాటిల్ పట్టుకొని పైన చూస్తున్నాడు. ఇక అతని చుట్టూ హార్ట్ సింబల్‌తో ఫైర్ అంటుకుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ గ్లింప్స్ పై మరింత హైప్ పెంచేసింది. Link
క్రేజీ పోస్టర్ విడుదల
సినిమా హైప్ పెరుగుదల
కిరణ్ అబ్బవరం మరియు యుక్తి తరేజా నటించిన ‘కె-ర్యాంప్’ సినిమా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షించింది.


