|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

K Ramp Trailer: ఫన్నీగా ‘కె ర్యాంప్’ ట్రైలర్

Published: 11-10-2025, 8:37 AM
K Ramp Trailer: ఫన్నీగా 'కె ర్యాంప్' ట్రైలర్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా నటించిన ‘కె ర్యాంప్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీపావళికి రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఫన్నీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన నెగెటివిటీని తగ్గించి, యూత్‍‌ని టార్గెట్ చేసి ఈ సినిమాను రూపొందించారు.

Key Points

1

'కె ర్యాంప్' ట్రైలర్ తాజాగా విడుదలై, ఫన్నీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

2

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

4

కుమార్ అనే అల్లరి కుర్రాడి ప్రేమకథగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ సూచిస్తుంది.

కె ర్యాంప్ ట్రైలర్ హైలైట్స్

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా ‘కె ర్యాంప్’. దీపావళి కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇప్పటికే ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్‍‌లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు. రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు వినిపించాయి.

సినిమా కథాంశం, తారాగణం

ట్రైలర్ బట్టి చూస్తే.. కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమె కూడా తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.

కిరణ్ అబ్బవరం కెరీర్, అంచనాలు

చాన్నాళ్లుగా కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు. కానీ గతేడాది దీపావళికి రిలీజైన ‘క’ చిత్రం మాత్రమే హిట్ అయింది. ఈ ఏడాది మార్చిలో ‘దిల్ రుబా’ అనే మూవీతో వచ్చాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో యూత్‍‌ని టార్గెట్ చేసి ‘కె ర్యాంప్’ తీశాడు. మరి ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి? దీపావళికి దీనితో పాటు మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

‘కె ర్యాంప్’ ట్రైలర్ అంచనాలను పెంచింది. దీపావళికి విడుదలవుతున్న ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌కు ఎలాంటి మలుపునిస్తుందో వేచి చూడాలి. యూత్‌ను ఆకట్టుకునే ఈ ఫన్నీ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.