|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘క’ సీక్వెల్ నుండి కిరణ్ అవుట్! మెగా హీరో ఎంట్రీ ఫిక్స్?

Published: 06-02-2026, 11:35 AM
షాకింగ్: 'క' సీక్వెల్ నుండి కిరణ్ అవుట్! మెగా హీరో ఎంట్రీ ఫిక్స్?
  • కిరణ్ అబ్బవరం లేకుండానే ‘క 2’ సీక్వెల్?
  • 2024 దీపావళికి విడుదలైన ‘క’ చిత్రం భారీ విజయం సాధించింది.
  • ‘క 2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
  • కథ డిమాండ్ చేస్తే హీరోని మార్చే అవకాశం ఉందని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి అన్నారు.

‘క’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సీక్వెల్‌లో కిరణ్ అబ్బవరం ఉండకపోవచ్చని, మెగా హీరో ఎవరైనా ఎంట్రీ ఇవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

‘క’ సినిమా సీక్వెల్ ఉంటుందా?

KA Sequel:సాధారణంగా ఒక సినిమా మంచి విజయం సాధించింది అంటే ఆనవాయితీగా ఆ సినిమాకి సీక్వెల్ రావడం ఇప్పుడు పరపాటి అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే.. ఒక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే ఏకంగా 41 చిత్రాలు సీక్వెల్స్ కి సిద్ధం అవుతున్నాయి అంటే ఇక సీక్వెల్స్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించడానికి ముందుకొస్తున్నాయో అర్థమవుతుంది. ఇదిలా ఉండగా మొదటి సినిమాలో ఎవరైతే నటిస్తారో సీక్వెల్ లో కూడా దాదాపు అదే హీరో హీరోయిన్, తదితరులు కంటిన్యూ అవుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అప్పుడప్పుడు హీరోయిన్ లేదా కొన్ని క్యారెక్టర్లు మారుతూ ఉంటాయి.. అయితే ఇక్కడ కిరణ్ అబ్బవరం సినిమా సీక్వెల్లో ఏకంగా కిరణ్ సినిమా నుండి తప్పుకుంటున్నారు అంటూ వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇదేంటి సినిమాలో హీరో లేకుండా మరెలా నడిపిస్తారు అంటూ కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. 2024 దీపావళికి విడుదల అయి.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క.. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు రాబట్టి మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఆయన నిర్మించిన చిత్రం శ్రీ చిదంబరం గారు.

కిరణ్ అబ్బవరం తప్పుకోవడానికి కారణం ఏమిటి?

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “క 2 చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అయితే హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు చేయలేదు” అంటూ ఆయన బాంబు పేల్చారు. దర్శక ద్వాయం సుజిత్ – సందీప్ ఈ సీక్వెల్ కోసం పనిచేస్తున్నారు. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే హీరోని కూడా మార్చే అవకాశం ఉంది ..కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది..హీరో పెర్ఫార్మెన్స్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాము” అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే క సినిమా కథ అక్కడితో ముగిసిందా? లేక మరో కొత్త ప్లాట్ తో సీక్వెల్ రాబోతోందా అనే అనుమానాలు ఇప్పుడు అభిమానులలో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కిరణ్ అబ్బవరం నిజంగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే అది ఈ సీక్వెల్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మెగా హీరో ఎంట్రీ నిజమేనా?

మరొకవైపు ఈ సినిమా నుండి కిరణ్ అబ్బవరం తప్పుకుంటున్నారు.. ఆ ప్లేస్లో మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించనున్నారు అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది.. మరి ఇందులో ఏది నిజమో తెలియాలి అంటే మళ్ళీ మేకర్స్ దీనిపై స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’ తో పాటు మరికొన్ని సినిమాలలో ఆయన నటిస్తున్నారు.

మొత్తానికి ‘క’ సీక్వెల్ విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం ఉంటాడా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ సినిమా కోసం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.