|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళనాడు ప్రభుత్వంపై ఖైదీ నటి సంచలన వ్యాఖ్యలు! ఇంతకీ ఏం జరిగిందంటే?

Published: 01-02-2026, 11:35 PM
తమిళనాడు ప్రభుత్వంపై ఖైదీ నటి సంచలన వ్యాఖ్యలు! ఇంతకీ ఏం జరిగిందంటే?
  • తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులపై నటి మోనిక అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • ‘ఖైదీ’ సినిమాలో కార్తీ కూతురిగా మోనిక నటనకు ప్రశంసలు లభించాయి.
  • అవార్డులు అర్హత లేని వారికి ఇస్తున్నారని మోనిక ఆరోపించారు.
  • ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ప్రతిభ ఆధారంగానే ఉండాలని మోనిక అభిప్రాయపడ్డారు.

నటి మోనిక తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కాకుండా ఇతరులకు అవార్డులు ఇవ్వడంపై ఆమె మనోవేదన చెందారు. ఈ విషయం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.

అవార్డులపై మోనిక అసంతృప్తి

Kaithi Actress Monica: తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులు (TamilNadu State Film Awards) ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమాలో కార్తీ కూతురిగా నటించి మెప్పించిన మోనిక, ఈ అవార్డుల ఎంపికపై తన మనసులోని ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది. అర్హత కలిగిన వారికి ఇవ్వకుండా అర్హత లేని వారికి అవార్డులు వస్తున్నాయంటూ ఆమె ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన వార్త తమిళ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. అయితే దీని గురించి అక్కడి ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి మరి.

Read also- Nindu Noorella Saavasam Serial Today February 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమానికి వచ్చిన అమర్

మోనిక కెరీర్ ప్రస్థానం

మోనిక తన కెరీర్‌లో 2016 నుండి 2022 మధ్య కాలంలో సుమారు 20కి పైగా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో క్రిటిక్స్ ప్రశంశలు అందుకున్నారు. ముఖ్యంగా ‘ఖైదీ’లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమె స్టార్ నటి అయ్యారు. ఇంతటి మంచి పాత్రలు వేసిన తనకు అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందంటూ వాపోయారు. ఈ నేపథ్యంలో ఉత్తమ బాల నటుల విభాగంలో ఎంపికైన వారి గురించి ఆమె స్పందిస్తూ.. “ప్రభుత్వం ప్రకటించిన విజేతలు నిజంగా ఆ స్థాయి గుర్తింపు పొందే నటనను ప్రదర్శించారా?” అని ప్రశ్నించారు. ‘ఇది వ్యక్తులు లేదా ప్రైవేట్ సంస్థలు ఇచ్చే అవార్డు కాదు. ఇది ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం. అర్హులకు గుర్తింపు దక్కనప్పుడు మనసుకి చాలా బాధ కలుగుతుంది.’ అంటూ అప్పటి బాల నటి మోనిక తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Read also- CCL 2026: ‘సీసీఎల్ 2026’ విజేతగా కర్ణాటక బుల్‌డోజర్స్.. ముగిసిన తెలుగు వారియర్స్ పోరాటం

నెటిజన్ల స్పందన

ఒక నటుడి జీవితంలో రాష్ట్ర స్థాయి అవార్డు అనేది ఎంతో గర్వకారణమని మోనిక పేర్కొన్నారు. ఇవి ఎవరి సిఫార్సుల మీదో లేదా పలుకుబడితో ఇచ్చేవి కాకూడదని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఉండాలని ఆమె ఆకాంక్షించారు. చాలా కాలం తర్వాత విడుదలైన ఈ అవార్డుల జాబితాపై నెటిజన్లలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోనిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెకు మద్దతుగా కొందరు, “అర్హత ఉన్న కళాకారులను ప్రోత్సహించినప్పుడే కళకు గౌరవం దక్కుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి మరి. ఇప్పటికే ఇదే విషయంపై తమిళనాడు లోని చాలా మంది నటీనటులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర స్థాయి అవార్డులు సిఫార్సుల మీద కాకుండా ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలని మోనిక కోరారు. ఈ వివాదంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.