|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిస్క్‌ చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌.. పొరపాటు జరిగితే అంతే

Published: 11-06-2025, 9:48 PM
రిస్క్‌ చేస్తున్న కాజల్‌ అగర్వాల్‌.. పొరపాటు జరిగితే అంతే

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి పాపులర్ అయిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు దర్శకురాలిగా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇండియన్ 3, కన్నప్ప చిత్రాల తరువాత ఈమె తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Key Points

1

కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు.

2

ఈమె తన స్వీయ దర్శకత్వంలో హిందీ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు.

4

కాజల్ తన కెరీర్ లో కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా?

కాజల్ అగర్వాల్ కొత్త అవతారం

పాన్‌ ఇండియన్‌ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్‌ అగర్వాల్‌( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్‌ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్‌ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు  ఉమెన్స్‌ సెంట్రిక్‌ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్‌ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్‌ అగ్వరాల్‌కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.

దర్శకురాలిగా కాజల్

అలాగే ఇటీవల కాజల్‌ అగర్వాల్‌ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్‌–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్‌ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌ అగర్వాల్‌ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

రిస్క్ తీసుకుంటున్నారా?

ఈమె మళ్లీ ఫ్రైమ్‌ టైమ్‌లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్‌ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్‌ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్‌ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా  ఎంజాయ్‌ చేయకుండా రిస్క్‌తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్‌కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి.

కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న ఈ రిస్కీ నిర్ణయం ఆమెకు విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి. ఆమె స్నేహితుల సూచనలను పాటిస్తుందో లేదో కూడా ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.