|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నెటిజన్ల ట్రోల్స్ ఎఫెక్ట్.. ‘రామాయణం’ నుండి కాజల్ అవుట్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

Published: 12-07-2025, 9:26 PM
నెటిజన్ల ట్రోల్స్ ఎఫెక్ట్.. ‘రామాయణం’ నుండి కాజల్ అవుట్.. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణం’ లో కాజల్ అగర్వాల్ నటనపై నెటిజన్ల ట్రోల్స్ కారణంగా ఆమెను తప్పించారని వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది.

Key Points

1

నెటిజన్ల ట్రోల్స్‌తో కాజల్ అగర్వాల్ ‘రామాయణం’ నుంచి బయటకు?

2

మండోదరి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ ఎంపిక?

4

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

కాజల్ అగర్వాల్‌పై నెటిజన్ల ట్రోలింగ్

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana). ఇందులో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి రాముడు, సీత పాత్రలో కనిపించనున్నారు. అలాగే యశ్- రావణుడు, సన్నీ డియోల్(Sunny Deol)- హనుమంతుడు, రవి దుబే- లక్ష్మిణుడు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను నితేష్ తివారీ(Nitesh Tiwari) తెరకెక్కిస్తుండగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా రాక్షస రాజు రావణాసురుని భార్య మండోదరి పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించడంతో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

‘రామాయణం’ నుండి కాజల్ బయటకు?

ఈక్రమంలోనే కాజల్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమెను ఎంపిక చేసుకోక ముందు వరకు చాలా హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేవట. కాజల్ వల్ల ట్రోల్స్ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని మూవీ మేకర్స్ కూడా ఆలోచించారట. ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మండోదరి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను ఎంపిన చేసుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మంచి నిర్ణయం అని అంటున్నారు.

మృణాల్ ఠాకూర్ ఎంపిక

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

కాజల్ అగర్వాల్ ‘రామాయణం’ నుండి తప్పుకోవడం, మృణాల్ ఠాకూర్ ఎంపికపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సినిమా యూనిట్ తీసుకున్న నిర్ణయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.