|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాన్‌ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’

Published: 04-11-2025, 3:26 AM
పాన్‌ ఇండియా చిత్రంగా ‘కాళీమాతా’

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘కాళీమాతా’ చిత్రాన్ని ప్రకటించారు. నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. ఇది కేవలం సినిమా కాదు, ఉద్యమం అని కేతిరెడ్డి అన్నారు.

Key Points

1

ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘కాళీమాతా’ చిత్రాన్ని ప్రకటించారు.

2

నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది.

4

‘కాళీమాతా’ కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.

‘కాళీమాతా’ చిత్ర ప్రకటన: నిర్మాత కేతిరెడ్డి

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadishwar Reddy) కొత్త సినిమాను ప్రకటించాడు. నిజ సంఘటనల ఆధారంగా ‘కాళీమాతా’(Kalimatha)ని తెరకెక్కించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రానికి ఆయన కథను అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘కాళీమాతా కేవలం సినిమా కాదు — ఇది ఒక ఉద్యమం.నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులను దాటి — “సత్యానికి పాస్‌పోర్ట్ ఉండదు” అనే విశ్వసత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది న్యాయం కోసం, సత్యం కోసం మానవత్వం చేసే ఆత్మపోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రంలో పాన్‌ ఇండియా స్టార్స్‌ నటించబోతున్నారు. అలాగే ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేస్తాం. కాస్టింగ్‌తో పాటు పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.

‘కాళీమాతా’ ఒక ఉద్యమం: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

పాన్‌ ఇండియా విడుదల వివరాలు, నటీనటుల ఎంపిక

పాన్‌ ఇండియా స్టార్స్‌, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ‘కాళీమాతా’ చిత్రం ప్రేక్షకులను సత్యం కోసం చేసే పోరాటానికి కలుపుతుందని ఆశిస్తున్నారు. పూర్తి వివరాల కోసం వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.