
📌 Key Points
- ప్రభాస్ కల్కి 2898 AD రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది.
- కల్కి సీక్వెల్‌లో గర్భిణి పాత్రలో నటించిన దీపికా పదుకొనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
- 8 గంటల వర్క్ విధానంపై ఆమె వ్యాఖ్యలు దీపికా నిష్క్రమణకు కారణం కావచ్చని ప్రచారం.
- దీపికా స్థానంలో సాయి పల్లవి, అనుష్క పేర్ల తర్వాత ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది.
ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ కల్కి 2898 AD తర్వాత, ఇప్పుడు కల్కి 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సీక్వెల్‌లో దీపికా పదుకొనే స్థానంలో ఎవరు నటిస్తారనే చర్చ సాగుతోంది. తాజాగా, ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
కల్కి 2898 AD విజయ పరంపర
ప్రభాస్ హీరోగా వచ్చిన మూవీ కల్కీ ( Kalki 2898 AD). ఈ సినిమా 2024 సంవత్సరంలో రిలీజ్ అయి బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించారు. చూడడానికి సింపుల్ గా ఉన్న ఆయన, ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకువెళ్లాడు.
దీపికా పదుకొనే ఎందుకు తప్పుకుంది?
ఈ సినిమాకు ప్రియాంక దత్, అశ్వని దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1000 కోట్లు క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు కల్కి 2 కూడా వస్తోంది. అయితే, ఈ కల్కి సినిమాలో గర్భవతిగా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, ఈ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో కల్కి సీక్వెల్ లో దీపికా స్థానంలో ఎవరు నటిస్తారు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 8 గంటల వర్క్ విధానం పై దీపికా వ్యాఖ్యలే ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తొలగించడానికి కారణం అయినట్లు ప్రచారం అయితే సాగుతోంది.
ప్రియాంక చోప్రాకు కల్కి 2 ఛాన్స్?
ఈ ప్రాజెక్టు నుంచి దీపికా ఔట్ కావడంతో, ఆమె స్థానంలో సాయి పల్లవి, అనుష్క లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఫైనల్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ కథకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు కల్కిలో కూడా ఛాన్స్ కొట్టేసిందట ప్రియాంక చోప్రా.
మొత్తానికి, కల్కి 2 ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దీపికా స్థానంలో ప్రియాంక చోప్రా రాకపై అధికారిక ప్రకటన వెలువడితే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇది టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది.


