|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రదీప్ రంగనాథన్ అకౌంట్లో ఆ రికార్డు మిస్ అయినట్టేనా?

Published: 09-12-2025, 5:08 PM
ప్రదీప్ రంగనాథన్ అకౌంట్లో ఆ రికార్డు మిస్ అయినట్టేనా?
  • ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలు వరుసగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి.
  • ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) మొదట డిసెంబర్ 18న విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
  • డిసెంబర్ నెలాఖరులో ‘కెప్టెన్ మిల్లర్’, ‘కూలీ’ వంటి భారీ చిత్రాలతో LIKకు పోటీ ఉంది.
  • LIK చిత్రాన్ని జనవరి లేదా ఫిబ్రవరికి వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ వరుస హిట్‌లతో దూసుకుపోతున్నాడు. అయితే, ఆయన నెక్స్ట్ సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) డిసెంబర్ 18న విడుదల కావడంపై సందేహాలున్నాయి. భారీ చిత్రాల పోటీ కారణంగా LIK వాయిదా పడుతుందనే వార్తలు ట్రేడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రదీప్ హ్యాట్రిక్ హిట్ హంగామా

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది నిజంగానే ఫైర్ డ్రాగన్ గా కనిపిస్తున్నాడు. డ్రాగన్, ‘డ్యూడ్’ రెండూ బ్యాక్-టు-బ్యాక్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎక్కాయి. ఈ హ్యాట్రిక్ హిట్ హంగామాలోనే ఆయన నెక్స్ట్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) కోసం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో, అనిరుధ్ మ్యూజిక్‌తో, కృతి శెట్టి హీరోయిన్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని డిసెంబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.

రిలీజ్‌కి ఇంకా పది రోజులే ఉనప్పటికీ ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. తమిళంలో కొన్ని టీజర్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు జరిగినా… తెలుగులో మాత్రం పూర్తి సైలెంట్ గా ఉన్నాడు. ఒక్క పోస్టర్, ఒక్క టీజర్ కూడా ఇంకా రాలేదు. దీంతో ట్రేడ్ సర్కిల్స్‌లో బలమైన టాక్ నడుస్తోంది: “LIK డిసెంబర్ 18న రాదు, పోస్ట్‌పోన్ అవుతుంది అని చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణాలు కూడా చెప్తున్నారు. డిసెంబర్ 20న ‘కెప్టెన్ మిల్లర్’, ‘సర్కారు నూకలు’ లాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా ‘కూలీ’, ‘విడుదల పార్ట్ 2’ రేసులో ఉన్నాయి. అంటే డిసెంబర్ నెలాఖరున భారీ క్లాష్ ఉంది. ఈ నేపథ్యంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో టీమ్ సేఫ్ గేమ్ ఆడి, జనవరి లేదా ఫిబ్రవరిలోకి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

LIK విడుదల వాయిదాపై చర్చ

భారీ చిత్రాలతో బాక్సాఫీస్ క్లాష్

డిసెంబర్ బాక్సాఫీస్ క్లాష్‌ను నివారించడానికి LIK నిర్మాతలు సురక్షితమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.