
📌 Key Points
- కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 22న శంకరపల్లి సమీపంలో ప్రత్యేక సెట్‌లో ప్రారంభం!
- కీలక సన్నివేశాల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్.. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం!
- ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలో కల్కి 2 షూటింగ్‌లో జాయిన్!
- 2027 చివరి నాటికి కల్కి 2 విడుదలయ్యే అవకాశం.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2 సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ మీ కోసం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే.
ఫిబ్రవరి 22 నుండి కల్కి 2 షూటింగ్ ప్రారంభం!
Kalki 2; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండియాలో ఏ స్టార్ కి లేనటువంటి లైనప్ ను సెట్ చేసుకున్నాడు ప్రభాస్. అందులో దేనికదే ప్రత్యేకం. వాటిలో కల్కి 2 ఒకటి. 2024లో వచ్చిన కల్కి 2898 AD మూవీ ఎంత పెద్ద విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా విజువల్ వండర్ గా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.
ఇక భైరవగా ప్రభాస్ నటన నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక సినిమాలో కనిపించే కురుక్షేత్రం ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా, కురుక్షేత్ర సమయంలో మనం ఉన్నామా అనే భ్రమను కలిగించేలా నాగ్ అశ్విన్ మ్యాజిక్ చేశాడు. ఆ సీన్స్ ఆడియన్స్ మైండ్ లో అలా రిజిస్టర్ అయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా కల్కి 2 రానున్న విషయం తెలిసిందే.
కమల్, అమితాబ్‌లతో నాగ్ అశ్విన్ సీన్స్!
అయితే, కల్కి సినిమా విడుదలై రెండేళ్లు గడుస్తున్నా కల్కి 2 షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ లోనే ఉన్నారు. అయితే, తాజాగా కల్కి 2 సినిమా షూటింగ్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 22న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యింది. శంకర పల్లి సమీపంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది.
2027లో విడుదల.. ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీటే!
ప్రస్తుతం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే కీలకమైన సీన్స్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 15 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే కల్కి 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ లేని సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈ న్యూస్ తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి 2 సినిమా 2027 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
కల్కి 2 సినిమా షూటింగ్ మొదలైందనే వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


