
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఉదయపూర్ ప్యాలెస్‌లో జరిగింది.
- కళ్యాణి ప్రియదర్శన్ ఈ వేడుకను చూసి ఎమోషనల్ అయ్యారు.
- కొత్తలోక సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ లేడీ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
- ఆనంద్ దేవరకొండ కూడా తన అన్న వదినల గురించి స్పందించారు.
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం ఉదయపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విజయ్, రష్మికల వివాహం ఎక్కడ జరిగింది?
Virosh Wedding:దాదాపు 8 సంవత్సరాల క్రితమే సినిమా సాక్షిగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) పెళ్లి చేసుకున్నారటంలో సందేహం లేదు. ‘గీతగోవిందం’ సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించి. అందరి హృదయాలను దోచుకున్నారు. నిజ జీవితంలో కూడా వీరిద్దరూ జంట అయితే బాగుండు అని కోరుకున్న అభిమానులు కూడా లేకపోలేదు. ఇక అలా అనుకున్నారో లేదో ఎనిమిదేళ్ల తర్వాత ఆ కోరిక నిజమైంది. ఎట్టకేలకు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న ఉదయపూర్ ప్యాలెస్ సాక్షిగా మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఒకటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం, ఇటు కొడవ జాతి మత ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
అయితే ఈ వివాహం అత్యంత సన్నిహితులు, సెలబ్రిటీల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకకు కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు ఈ వివాహాన్ని చూడడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అంటూ లేడీ సూపర్ హీరో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఇటీవల కొత్తలోక సినిమాతో తొలిసారి ఒక ఫిమేల్ లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమె ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). తాజాగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహానికి వెళ్లిన ఈమె.. ఆ మధుర క్షణాలను ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా పంచుకుంది.
కళ్యాణి ప్రియదర్శన్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు?
“ఈరోజు నేను అత్యంత దయగల అమ్మాయి.. తన ప్రాణ స్నేహితుడిని అత్యంత ఉత్కంఠభరితమైన వాతావరణంలో వివాహం చేసుకోవడం చూశాను. అతని వైపు ఆమె నడుస్తున్నప్పుడు.. ఆమె వేసే ప్రతి అడుగు బరువును అతడు ఆస్వాదించడానికి దగ్గరుండి మరీ చూశాను. నెమ్మదిగా, స్థిరంగా ఊపిరి పీల్చుకున్న శ్వాసలు.. ఉప్పొంగుతున్న కన్నీళ్లు.. నన్ను మరింత ఎమోషనల్ కి గురిచేసాయి. కృషి, గౌరవం , లోతైన స్నేహంతో నిర్మించిన ఈ ప్రయాణం నిండు నూరేళ్లు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆనంద భరితమైన క్షణాలను చూసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ కళ్యాణి ప్రియదర్శన్ చెప్పుకొచ్చింది.
ఆనంద్ దేవరకొండ ఎలా స్పందించారు?
తన అన్న వదినల వివాహంపై విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand deverakonda) కూడా స్పందించారు. “అభిమానులు అన్నా వదిన ఎలా ఉన్నారు అని అరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నాకు ఎలా స్పందించాలో అస్సలు తెలియదు. ఈరోజు నా సోదరుడు వివాహం చేసుకున్నాడు. నా వదిన లాంటి అత్యంత సానుకూల, కరుణామయి వ్యక్తిని నేను పొందాను. వారు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆనంద్ దేవరకొండ పోస్ట్ పంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొత్తానికి విరోష్ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. కళ్యాణి ప్రియదర్శన్ ఎమోషనల్ కామెంట్స్, ఆనంద్ దేవరకొండ స్పందన ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.


