
కల్కి 2898 ఏడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, దాని సీక్వెల్ పై అంచనాలు పెరిగాయి. సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె తప్పుకుందనే ప్రచారం నేపథ్యంలో కల్యాణి ప్రియదర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ రూమర్‌పై కల్యాణి స్పందిస్తూ, ఇది తనకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోందని వెల్లడించింది.
Key Points
గతేడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కల్కి సీక్వెల్‌లో దీపికా పదుకొణె స్థానంలో కొత్త నటిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దీపికా పాత్రకు ఆలియా, సాయిపల్లవి పేర్లతో పాటు కల్యాణి ప్రియదర్శన్ పేరు కూడా వినిపించింది.
ఈ రూమర్‌పై కల్యాణి స్పందిస్తూ, తన పేరు పరిశీలించడం సంతోషంగా ఉందని, ఇది కొత్త అనుభూతి అని చెప్పింది.
‘కల్కి 2898 ఏడీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది
గతేడాది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD Movie ) ఒకటి. ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వెయ్యి కోట్లపైనే వసూలు చేసి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
దీపికా స్థానంలో కల్యాణి? ఇలాంటి సమయంలో కల్కి సీక్వెల్ నుంచి దీపికా ( Deepika Padukone )ను తొలగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. 8 గంటల పని, తన టీమ్ మెంబర్స్‌కు లగ్జరీ వసతులు, లాభాల్లో వాటా.. ఇలా కొన్ని భారీ షరతుల కారణంగా ఆమెను సైడ్ చేశారు. దీంతో దీపికా పాత్రలో ఎవరు నటించనున్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. దీపికా స్థానంలో ఆలియా భట్, సాయిపల్లవి, అనుష్కల పేర్లు వినిపించాయి. ఇటీవల కొత్త లోక: చాప్టర్ 1తో సక్సెస్ అందుకున్న కల్యాణి ప్రియదర్శన్ ( Kalyani Priyadarshan ) పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.
దీపికా స్థానంలో కల్యాణి ప్రియదర్శన్ పేరు ప్రచారంలోకి
అంతకన్నా సంతోషం ఇంకేముంది? ఈ రూమర్‌పై కల్యాణి స్పందించింది. కొందరు ఇదేపనిగా యాక్టర్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనుకుంటా.. ఏదేమైనా నా పేరు పరిశీలిస్తున్నారంటే నాకు సంతోషంగానే ఉంది. నన్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? కానీ, వాళ్లు ఎవర్ని ఫైనల్ చేశారు? ఎవరిని తీసుకోబోతున్నారు? అన్నది చెప్పడం చాలా కష్టం. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలని కోరుకుంటున్నారంటేనే ఎంతో సంబంరంగా ఉంది. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ కలగలేదు అని చెప్పుకొచ్చింది.
కల్యాణి ప్రియదర్శన్ స్పందన ఇదే!
కల్కి సీక్వెల్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని కల్యాణి ప్రియదర్శన్ పేర్కొంది. ఈ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాలి. సినిమా బృందం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


