|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kamal Haasan: ‘హృదయ విదారకం.. నిర్లక్ష‍్యం ఎవరిదైనా క్షమించరానిది’

Published: 08-07-2025, 11:58 AM
Kamal Haasan: 'హృదయ విదారకం.. నిర్లక్ష‍్యం ఎవరిదైనా క్షమించరానిది'

తమిళనాడులోని కడలూరులో జరిగిన విషాదకర రైలు ప్రమాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టడంతో విద్యార్థులు మృతి చెందడం ఆయనను కలిచివేసిందని పేర్కొన్నారు.

Key Points

1

కడలూరు రైలు ప్రమాదంలో విద్యార్థులు మృతి.

2

కమల్ హాసన్ తీవ్ర విచారం వ్యక్తం.

4

ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.

కడలూరు రైలు ప్రమాదం

కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కడలూరు ప్రమాదంపై స్పందించారు . ఇవాళ తమిళనాడులో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో విద్యార్థులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు . ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు . ఈ ఘటనకు కారణం ఎవరైనా ఇది క్షమించరానిది అని ట్వీట్ చేశారు . ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ కోరారు .

కమల్ హాసన్ స్పందన

కమల్ హాసన్ తన ట్వీట్ ‌ లో రాస్తూ ..’ ఇది చాలా హృదయ విదారక వార్త. కడలూరు-సెమ్మంగుప్పం రైల్వే లైన్‌లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల బస్సును రైలు ఢీకొని విద్యార్థులు మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షమించరానిది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం , రైల్వే శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి. తమ పిల్లలను కోల్పోయినందుకు బాధపడుతున్న తల్లిదండ్రులు, బంధువులు , స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ‘ అంటూ సంతాపం తెలియజేశారు.

నిర్లక్ష్యంపై ఆగ్రహం

కాగా.. ఇవాళ ఉదయం తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం చెమ్మంగుప్పం వద్ద ఓ స్కూల్‌ వ్యాన్‌ రైలు పట్టాలను దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది విధ్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే..  గేట్‌మేన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందన్న విమర్శలు వినిపిస్తుండగా.. మరోవైపు డ్రైవర్‌ కోరితేనే తాను గేటు తెరిచానని గేట్‌మేన్‌ చెబుతున్నాడు. ఈ క్రమంలో తప్పెవరిదనే చర్చ నడుస్తోంది. ఈలోపు గేట్‌మేన్‌ పంకజ్‌శర్మను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

ఈ ఘోర ప్రమాదం తక్షణ చర్యల అవసరాన్ని ఎత్తి చూపుతోంది. ప్రభుత్వం, రైల్వే శాఖలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.