
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ‘KHAA’ పేరుతో మరో ఎక్జైటింగ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమాతో ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ దర్శకులుగా అరంగేట్రం చేయనున్నారు. ‘హంట్ మోడ్ ఆన్’ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం భారీ యాక్షన్ స్పెక్టకిల్‌గా రానుంది.
Key Points
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కొత్త ప్రాజెక్ట్ 'KHAA' అనౌన్స్ చేశారు.
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ దర్శకులుగా పరిచయం.
'హంట్ మోడ్ ఆన్' ట్యాగ్‌లైన్‌తో భారీ యాక్షన్ స్పెక్టకిల్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
కొత్త ప్రాజెక్ట్ ‘KHAA’ ప్రకటన
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్జైటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరీవ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ (RKFI)పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ప్రాజెక్ట్ ‘KHAA’ను కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స చేశారు. ‘హంట్ మోడ్ ఆన్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ప్రకటించిన ఈ చిత్రం కమల్ హాసన్ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్ స్పెక్టకిల్‌గా రూపుదిద్దుకోబోతోంది. కమల్‌తో కలసి విక్రమ్ సినిమాలో తమ అద్భుతమైన స్టంట్ కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అన్బరీవ్.. ఇప్పుడు దర్శకులుగా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నారు. టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నా ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
అన్బరీవ్ దర్శకత్వంలో భారీ యాక్షన్
రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మాణంలో
కమల్ హాసన్ పుట్టినరోజున ‘KHAA’ ప్రాజెక్ట్ ప్రకటించడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్బరీవ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ఈ భారీ యాక్షన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.


