|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏడాదికి వందకోట్లు సంపాదిస్తున్న స్టార్‌ హీరో భార్య ఎవరో తెలుసా? రిచ్చెస్ట్ వైఫ్‌

Published: 08-10-2025, 3:41 AM
ఏడాదికి వందకోట్లు సంపాదిస్తున్న స్టార్‌ హీరో భార్య ఎవరో తెలుసా? రిచ్చెస్ట్ వైఫ్‌

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వార్షికాదాయం రూ.100 కోట్లతో ఆమె ఇండియాలోనే అత్యంత సంపన్న స్టార్ వైఫ్‌గా నిలిచారు. ఇంటీరియర్ డిజైనర్‌గా, నిర్మాతగా ఆమె వ్యాపార సామ్రాజ్యం అద్భుతం.

Key Points

1

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అత్యంత సంపన్న సెలబ్రిటీ వైఫ్‌.

2

ఆమె ఆస్తి రూ.1600 కోట్లు, ప్రముఖ నటి దీపికా పదుకొణె కంటే 3 రెట్లు ఎక్కువ.

4

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ-వ్యవస్థాపకురాలిగా పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణం.

గౌరీ ఖాన్ విలాసవంతమైన జీవితం, సంపద

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నేడు (అక్టోబర్‌ 8న) 50వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె లైఫ్‌ స్టయిల్‌ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. అత్యంత లగ్జరీ లైఫ్‌ని ఆమె అనుభవిస్తుంది. చాలా వరకు గౌరీ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఆమెకు దేశ, విదేశాల్లో లగ్జరీ బంగ్లాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అంతేకాదు చాలా బ్రాండెడ్ కార్లకు యజమాని కూడా.  గౌరీ ఖాన్‌ చాలా వరకు అంతర్జాతీయ బ్రాండెడ్ దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు.

గౌరీ ఖాన్ ఆస్తి విషయాలు చూస్తే, ఆమె దగ్గర ప్రముఖ నటి దీపికా పదుకొణె కంటే 3 రెట్లు ఎక్కువ సంపద ఉంది. లైఫ్‌స్టైల్ ఆసియా నివేదిక ప్రకారం, ఆమె సుమారు రూ.1600 కోట్ల ఆస్తికి యజమాని. దీపికా దగ్గర 500 కోట్ల ఆస్తి ఉంది. అదే సమయంలో, గౌరీ సంపదతో ఇటీవల విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ లాంటివి 13 సినిమాలు తీయొచ్చు.

గౌరీ ఖాన్ సినిమా రంగం నుంచే వచ్చారు కానీ, ఆమె ఇప్పుడు ఇండియాలోనే అత్యంత సక్సెస్‌ ఫుల్‌ బిజినెస్‌ ఉమెన్‌ కావడం విశేషం. ఆమెకు ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం ఉంది. ఇది కాకుండా, ముంబైలో ఆమెకు ‘టోరి’ అనే రెస్టారెంట్ ఉంది. ఆమె వార్షిక ఆదాయం సుమారు రూ. 100 కోట్లు అని ముంబయి మీడియా వెల్లడించింది. బాలీవుడ్‌ స్టార్స్ వైఫ్స్ లోనే గౌరీ అత్యంత రిచ్చెస్ట్ వైఫ్‌ కావడం విశేషం.

ఇంటీరియర్ డిజైనింగ్, వ్యాపార సామ్రాజ్యం

గౌరీ ఖాన్ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనే విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోని చాలా మంది తారల ఇళ్లను ఆమెనే డిజైన్ చేశారు. వీరిలో రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కరణ్ జోహార్, ముఖేష్ అంబానీ, రాబర్టో కావల్లీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వారు ఉన్నారు. వీరి ఇళ్ల గురించి ఇండియానే కాదు, ప్రపంచం మాట్లాడుకుంటుంది. దాని క్రెడిట్‌ మొత్తం గౌరీకే దక్కుతుందని చెప్పొచ్చు.  దీంతో ఆమె తన భర్త షారూఖ్‌ కంటే ఎక్కువగా సంపాదిస్తుందని చెప్పొచ్చు.

వ్యాపారవేత్తతో పాటు, గౌరీ ఖాన్ సినిమా నిర్మాత కూడా. ఆమె రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థకు సహ-వ్యవస్థాపకురాలుగా ఉన్నారు.  ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు  ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’, ‘రా వన్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘బిల్లా’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘దిల్‌వాలే’, ‘రయీస్’, ‘జవాన్’, ‘డంకీ’ వంటి సినిమాలను నిర్మించారు. చాలా వరకు షారూఖ్‌ ఖాన్‌ హీరోగానే ఈ మూవీని తెరకెక్కించారు. వాటిలో చాలా వరకు సక్సెస్‌ కావడం విశేషం.

నిర్మాతగా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్

గౌరీ ఖాన్ దగ్గర అద్భుతమైన బ్రాండెడ్ కార్ల కలెక్షన్ ఉంది. ఆమె దగ్గర బెంట్లీ కాంటినెంటల్ జీటీ, మెర్సిడెస్ మేబ్యాక్, మెర్సిడెస్ ఎస్-క్లాస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ 6 సిరీస్ కన్వర్టిబుల్, ఆడి ఎ8 వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధర కోట్లలో ఉంటుందనే విషయం తెలిసిందే.

గౌరీ ఖాన్‌కు అలీబాగ్‌లో రూ.15 కోట్ల విలువైన బంగ్లా ఉంది. దుబాయ్‌లో ఆమెకు ఒక విల్లా ఉంది. లండన్‌లో కూడా ఒక ఇల్లు ఉంది, దాని విలువ రూ.172 కోట్లుగా చెబుతారు. జుహూలో ఒక స్టూడియో ఉంది, దాని విలువ 150 కోట్లు. ఇలా అటు వ్యాపారం, ఇటు లగ్జరీ హౌజెస్‌, కార్లతో లావిష్‌ లైఫ్‌ని అనుభవిస్తున్నారు గౌరీఖాన్‌.

షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కేవలం సెలబ్రిటీ వైఫ్ కాదు. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్త, ఇంటీరియర్ డిజైనర్, నిర్మాత. రూ.100 కోట్ల వార్షికాదాయంతో, ఇండియాలో అత్యంత సంపన్న స్టార్ వైఫ్‌గా ఆమె తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.