
నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ ట్రైలర్ విడుదలైంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ట్రైలర్‌లో ఎమోషన్ మరియు యాక్షన్ అద్భుతంగా కలిసిపోయాయి.
Key Points
నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఎమోషనల్ మరియు యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
సినిమాపై ట్రైలర్‌తో భారీ అంచనాలు పెరిగాయి.
‘తమ్ముడు’ ట్రైలర్ విడుదల
హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నా ఈ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘మీ అక్కను చూశావా..? తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ, క్యారక్టర్‌ను మాత్రం లూజ్ అవ్వలేదు’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌లో ‘చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే చాన్స్ వచ్చింది.. నిలబెడతా’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ట్రైలర్ బట్టి చూస్తే అక్క మాటని నిలబెట్టే తమ్ముడి కథ ఇదని తెలుస్తోంది. అలాగే ఎమెషన్‌కు యాక్షన్ తోడైతే ఎలా ఉంటుంది అనేది ఈ ట్రైలర్ అర్థం అవుతోంది. మొత్తంగా ‘తమ్ముడు’ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో అంచనాలు పెంచేలా ఉంది.
ఎమోషన్ మరియు యాక్షన్ కలయిక
జూలై 4న గ్రాండ్ రిలీజ్
మొత్తంగా ‘తమ్ముడు’ ట్రైలర్ అంచనాలను పెంచింది. ఎమోషన్ మరియు యాక్షన్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

