|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీన స్థితిలో ఉన్న నటి పాకీజాకి అండగా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌.. ఎంత సాయం అందించారో తెలుసా?

Published: 01-07-2025, 7:59 AM
దీన స్థితిలో ఉన్న నటి పాకీజాకి అండగా నిలిచిన పవన్‌ కళ్యాణ్‌.. ఎంత సాయం అందించారో తెలుసా?

‘అసెంబ్లీ రౌడీ’ సినిమా నటి పాకీజా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. తన దీనస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ ఆమెకు ఆర్థిక సాయం అందించడంతో ఆమెకు కొంత ఉపశమనం లభించింది.

Key Points

1

పవన్ కళ్యాణ్ నటి పాకీజాకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు.

2

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజా, పవన్ కళ్యాణ్ ను ఆదుకోవాలని వేడుకుంది.

4

పాకీజా పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

పాకీజా ఆర్థిక ఇబ్బందులు

`అసెంబ్లీ రౌడీ` సినిమాతో పాపులర్‌ అయిన నటి, కమెడియన్‌ పాకీజా(వాసుకీ) ఒకప్పుడు కామెడీ పాత్రలతో నవ్వులు పూయించింది. బ్రహ్మానందంతో వచ్చే ఆమె సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో చాలా సినిమాల్లో మెరిసిన ఆమె ఇటీవల కనుమరుగయ్యింది.

అయితే గత కొంత కాలంగా ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో ఇటీవల తనని ఆదుకోవాలని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేసింది. సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లను వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ క్రమంలో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.

నటి పాకీజా ఆవేదనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మన్నించాడు. ఆమెకి తనవంతుగా ఆర్థిక సాయాన్ని అందించారు. పాకీజా దీన స్థితిని పవన్‌ దృష్టికి రావడంతో ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి . హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  నటి పాకీజాకు అందజేశారు.

పవన్ కళ్యాణ్ స్పందన

ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ,

తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఆమె వీడియో వైరల్‌ అవుతుంది.

అంతకు ముందు నటి పాకీజా ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు షూటింగ్‌ లు లేవని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడంతో సొంతూరు కారైకుడికి వచ్చినట్టు చెప్పారు.

రూ. 2 లక్షల ఆర్థిక సాయం

ఏదైనా సాయం చేస్తారని సీఎంని కలవడానికి రెండు సార్లు ప్రయత్నించానని, కానీ కలవడం కుదరలేదని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంని కలవాలని ప్రయత్నించినా, కుదరలేదని తెలిపారు.

తనకు తమిళనాడులో ఆధార్‌ కార్డ్ ఉందని, దీని ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో నెల నెల పెన్షన్‌ వచ్చేలా చేయండి, మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటాను. భర్త, పిల్లలు ఎవరూ లేరు, అనాథగా ఉంటున్నా, గతంలో చిరంజీవి, నాగబాబు సాయం చేశారు.

ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పవన్‌ దయజేసి నన్ను ఆదుకోండి, నాకు కనీసం పెన్షన్‌ అందేలా చేయండి అని ఆమె వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఇది పవన్‌ కళ్యాణ్‌కి చేరడంతో ఆయన రెండు లక్షల సాయం అందజేశారు.

పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సాయంతో పాకీజాకు కొంత ఉపశమనం లభించింది. ఆమె పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సినీ ఇండస్ట్రీలో మంచి అనుకూలతను సృష్టించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.