
📌 Key Points
- కమల్ హాసన్ ‘కల్కి పార్ట్ 2’ సెట్స్‌కు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
- ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ ప్రయాణాలకు దూరంగా ఉండటంపై వైజయంతీ మూవీస్ ప్రశంసించింది.
- సినీ పరిశ్రమలో బడ్జెట్ సమస్యలు, నటీనటుల పారితోషికాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
- ‘కల్కి 2898 ఏడీ’ గతంలో రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
‘కల్కి పార్ట్ 2’ సెట్స్‌కు లోకనాయకుడు కమల్ హాసన్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ ప్రయాణాలకు దూరంగా ఉండటంపై వైజయంతీ మూవీస్ ప్రశంసించింది. సినీ పరిశ్రమ బడ్జెట్ సమస్యలతో సతమతమవుతున్న వేళ, కమల్ నిర్ణయం గొప్ప సందేశాన్నిచ్చింది.
కమల్ హాసన్ సింప్లిసిటీకి వైజయంతీ మూవీస్ ఫిదా
Kamal Simplicity : బడ్జెట్ .. బడ్జెట్ ..బడ్జెట్ ..సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్.. బడ్జెట్లు భారమైపోతున్నాయి, నటీనటుల పారితోషికాలు, వాళ్ల లగ్జరీ మెయింటెనెన్స్ ఖర్చుల వల్లే నిర్మాతలు కోలుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఇదే ఇపుడు అతి పెద్ద సమస్య. అలాంటి ఈ సమయంలో ‘లోకనాయకుడు’ కమల్‌హాసన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆయన ఎంతటి మహానటుడో, అంతకంటే గొప్ప సంస్కారం ఉన్న మనిషని మరోసారి నిరూపించుకున్నారు. లగ్జరీ లైఫ్, చార్టర్డ్ ఫ్లైట్స్, ప్రైవేట్ జెట్ హంగామాకు దూరంగా.. ఒక సాదాసీదా సామాన్యుడిలా ఆయన ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించి డైరెక్ట్ గా షూటింగ్ సెట్‌కు చేరుకోవడం ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ ని షాక్ కి గురిచేస్తుంది.
కమల్ హాసన్ ని ఆకాశానికి ఎత్తేసిన వైజయంతీ మూవీస్
ఇక ఇదే విషయాన్ని ‘కల్కి’ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కమల్ హాసన్ ని ఆకాశానికి ఎత్తేసింది.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎన్నో సమస్యలని ఫేస్ చేస్తున్న ఈ సమయంలోకమల్‌హాసన్ ప్రైవేట్ చార్టర్ విమానాలు, లగ్జరీ ప్రయాణాలను వదులుకుని ఎకానమీ ఫ్లైట్‌లో రావడం ఆయన లెజెండరీ స్థానానికి నిదర్శనమని తెలిపింది.సినీ ఇండస్ట్రీలో అద్భుతాలు జరగడానికి, నిర్మాతల కష్టాలు తీరడానికి ఇదొక గొప్ప మొదటి అడుగు అంటూ వైజయంతీ మూవీస్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఎకానమీ ఫ్లైట్ లో కమల్ కూర్చుని ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Mr. @ikamalhaasan choosing to let go of private charters and luxury travel to take an economy flight and head straight to the shoot sets, at a time when the industry is navigating tough realities, this says everything about the legend he is.
సినీ పరిశ్రమ బడ్జెట్ సమస్యలు: కమల్ నిర్ణయం
A first step towards greater things… pic.twitter.com/1bzVYc6igg
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 18, 2026
ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్
‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్ విజయం
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ..రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ గతేడాది జూన్ 2024లో విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కేవలం కొన్ని నిమిషాల పాటే కనిపించినా, థియేటర్లలో పూనకాలు తెప్పించారు. ఇక కల్కి మొదటి భాగం ముగింపులోనే పార్ట్-2 పై భారీ అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్.
మిగతా హీరోలకు కూడా ఒక గట్టి మెసేజ్
ప్రస్తుతం ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ సీక్వెల్ ‘కల్కి పార్ట్ 2’ షూటింగ్ హైదరాబాద్‌లో యమా జోరుగా సాగుతుంది.ఈ షెడ్యూల్ కోసమే కమల్ హాసన్ ఇలా సాధారణ ప్రయాణీకుడిలా ఫ్లైట్ లో వచ్చి ల్యాండ్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్‌లో కమల్ హాసన్, బాలీవుడ్ షహన్‌షా అమితాబ్ బచ్చన్‌లపై అత్యంత కీలకమైన సీన్స్ ని మేకర్స్ తెరకెక్కిస్తున్నరట మేకర్స్.ఏది ఏమైనా కమల్ హాసన్ లాంటి విశ్వనటుడు ఇలా సింప్లిసిటీని చాటుకోవడం మిగతా హీరోలకు కూడా ఒక గట్టి మెసేజ్ అనే చెప్పాలి.
కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఆయన వ్యక్తిత్వాన్ని చాటడమే కాదు, సినీ పరిశ్రమకు ఒక కొత్త దిశను చూపింది. నిర్మాతల కష్టాలు తీరడానికి ఇదొక గొప్ప మొదటి అడుగు అని వైజయంతీ మూవీస్ పేర్కొంది.


