|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ తెలుగులోనూ థియేటర్లకు.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published: 03-08-2025, 9:43 AM
బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కన్నడ హారర్ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’ తెలుగులోనూ థియేటర్లకు.. 9.1 ఐఎండీబీ రేటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

కన్నడలో సంచలన విజయం సాధించిన ‘సు ఫ్రమ్ సో’ హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 9.1 IMDb రేటింగ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది.

Key Points

1

కన్నడలో భారీ విజయం సాధించిన 'సు ఫ్రమ్ సో' సినిమా

2

రూ. 33.7 కోట్ల నెట్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది

4

9.1 IMDb రేటింగ్‌తో అద్భుతమైన ప్రేక్షకాదరణ

‘సు ఫ్రమ్ సో’ తెలుగులో విడుదల తేదీ

కన్నడ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘సు ఫ్రమ్ సో’ (Su From So) మూవీ రికార్డులు తిరగరాస్తోంది. కన్నడలో రికార్డు కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ తో జైజేలు కొట్టించుకుంటోంది. వసూళ్ల సునామీని చూపిస్తోంది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ తెలుగులోనూ థియేటర్లకు రాబోతోంది.

జులై 25, 2025న థియేటర్లలో రిలీజైంది కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘సు ఫ్రమ్ సో’. కేవలం రెండు కోట్ల రూపాయాల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. 10 రోజుల్లోనే ఇండియాలో రూ.33.7 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. గ్రాస్ వసూళ్లు చూసుకుంటే రూ.40 కోట్లు దాటాయి. ఈ మూవీ క్రేజ్ కారణంగా ఆగస్టు 1న మలయాళంలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులో డబ్ చేయబోతున్నారు.

కన్నడ బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం

సు ఫ్రమ్ సో సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ తీసుకు రాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆగస్టు 8న ఈ మూవీ తెలుగులో థియేటర్లో రిలీజ్ కానుంది.

‘‘మరో లెవల్ నవ్వుల అల్లరి ఎదురు చూస్తోంది. రీసెంట్ సెన్సేషన్, కన్నడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సు ఫ్రమ్ సో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఆగస్టు 8న రాబోతుంది. ట్రైలర్ రేపు విడుదలవుతుంది. మైత్రీ రిలీజ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.

కథ, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

సు ఫ్రమ్ సో సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్. కోస్టల్ విలేజ్ లో ఆవారాగా తిరిగే అశోక అనే కుర్రాడు ఉంటాడు. అతను సులోచన అనే దెయ్యాన్ని ప్రేమిస్తున్నాడనే రూమర్లు అంతటా వ్యాపిస్తాయి. ఆ తర్వాత గ్రామంలో సూపర్ నేచురల్ గా కొన్ని ఘటనలు జరుగుతాయి. కామెడీ పంచడంతో పాటు హారర్ థ్రిల్ ను అందిస్తాయి. మరి చివరకు ఏం జరిగింది? ఆ దెయ్యం నిజమేనా? ఆ కుర్రాడికి ఎందుకిలా అయిందనేది కథ.

సు ఫ్రమ్ సో సినిమాకు లీడ్ రోల్ ప్లే చేసిన జేపీ తుమినాడ్ డైరెక్టర్. అతనే సినిమాలో కీలక పాత్ర పోషించాడు. కథ కూడా అతనే రాశాడు. లైటర్ బుద్ధ ఫిల్మ్స్ పై శశిథర్ శెట్టి, రవి రాయ్, రాజ్ బి శెట్టి ఈ మూవీని నిర్మించారు.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సు ఫ్రమ్ సో’ సినిమా భారీ విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.