
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తక్కువగా కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
Key Points
మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకి రాబోతోంది.
సినిమా దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్, రామాయణం, మహాభారతం వంటి సీరియళ్లకు దర్శకత్వం వహించారు.
'కన్నప్ప' ప్రమోషన్లలో దర్శకుడు తక్కువగా కనిపించడం గమనార్హం.
ముకేశ్ కుమార్ సింగ్ ఒక హిందీ దర్శకుడు, తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువ.
‘కన్నప్ప’ సినిమా రిలీజ్ వీకెండ్ లో
మంచు ఫ్యామిలీ తీసిన ‘కన్నప్ప’.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
గత కొన్నాళ్ల నుంచి ‘కన్నప్ప’ ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. ‘కన్నప్ప’ విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఈయన కనిపించారు.
దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ బ్యాక్ గ్రౌండ్
సడన్‌గా ‘కన్నప్ప’ దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్‌కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.
అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్‌కి.. ‘కన్నప్ప’ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.
ప్రమోషన్లలో దర్శకుడి అరుదైన కనిపించడం
మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన ‘కన్నప్ప’లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
చివరగా, ‘కన్నప్ప’ సినిమా రిలీజ్ తర్వాత ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రమోషన్లలో ఆయన తక్కువగా కనిపించినప్పటికీ, సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.


