
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీక్ అయిన వీడియోలో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశం ఎలా ఉందో చూద్దాం.
Key Points
కన్నప్ప సినిమాలో ప్రభాస్ సీన్ లీక్!
సెకండాఫ్‌లో ప్రభాస్ సూపర్ ఎంట్రీ!
థియేటర్లో అభిమానుల ఉత్సాహం అదరగొట్టింది!
వైరల్ అవుతున్న వీడియోలు, డిలీట్ అవుతున్న ట్వీట్లు!
కన్నప్ప మూవీలో ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్
మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. బాలీవుడు డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మధుబాల , కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.
అయితే, కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించండతో మూవీపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తోడు కన్నప్ప టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించిన తీరుకు మూవీపై ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ను చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు.
ఇక భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 27) వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో కన్నప్ప సినిమా విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప మూవీలోని ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయింది. థియేటర్ నుంచి లీక్ అయిన ప్రభాస్ సీన్ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ సీన్ ప్రభాస్, అక్షయ్ కుమార్ ఇద్దరికీ సంబంధించినదిగా ఉంది. అయితే, ఈ లీక్ అయిన వీడియో ప్రభాస్ ఎంట్రీ సీన్ అని తెలుస్తోంది. అది కూడా అక్షయ్ కుమార్‌తో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశం ఉందని వీడియో చూస్తుంటే తెలుస్తోంది. కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్, రుద్రుడిగా ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే.
శివుడైన అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవగానే ప్రభాస్‌ను చూపించారు. ఈ వీడియోలో మొదటగా ప్రభాస్ కళ్లు, ఆ తర్వాత వీపు వైపు నుంచి కెమెరా యాంగిల్ చూపించారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ, పేపర్స్ జల్లుతూ గోల చేశారు. అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్ మారుమోగిపోయింది. డ్యాన్స్ కూడా చేస్తూ ఫ్యాన్స్ అల్లరి చేశారు.
అభిమానుల స్పందన, థియేటర్ వాతావరణం
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్‌లో షేర్ చేసిన వీడియోలను డిలీట్ కూడా చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఎంట్రీ సీన్ సెకండాఫ్‌లోనే ఉందని రివ్యూవర్స్ తెలిపారు. ఈ విషయాన్ని కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రైటర్ బీవీఎస్ఎన్ రవి కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, లీక్ అయిన ప్రభాస్ సన్నివేశానికి ఉన్న ఇంపార్టెన్స్ తెలియరాలేదు. కాగా, కన్నప్ప సినిమాలో మంచు విష్ణు కు జోడీగా హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటించింది. అలాగే, పార్వతిగా కాజల్ అగర్వాల్, కృతగా మోహన్ లాల్, మహాదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు నటించగా శరత్ కుమార్, ముఖేష్ రుషి, మధుబాల తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
చివరిగా, కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ కావడం సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. సెకండాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


