|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్ప నుంచి మంచు విష్ణు కూతుళ్ల స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్, సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Published: 27-05-2025, 10:49 AM
కన్నప్ప నుంచి మంచు విష్ణు కూతుళ్ల స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్, సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

మంచు విష్ణు నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇది. విష్ణు కుమార్తెలు అరియానా, విరియానా నటించిన ‘శ్రీకాళహస్తి’ పాట ప్రోమో విడుదలైంది. ఈ పాట మే 28న విడుదల కానుంది.

Key Points

1

మంచు విష్ణు కన్నప్ప సినిమాకు సంబంధించిన ‘శ్రీకాళహస్తి’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదలైంది.

2

మంచు విష్ణు కుమార్తెలు అరియానా, విరియానా తమ డెబ్యూ చేస్తున్నారు.

4

ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి తారాగణం సినిమాలో నటిస్తున్నారు.

‘శ్రీకాళహస్తి’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల

మంచు విష్ణు ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప.  విష్ణు హీరోగా  బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మైథలాజికల్ డ్రామా ‘కన్నప్ప. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు టీమ్. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి వరుస అప్ డేట్ లు వదులుతున్నారు కన్నప్ప టీమ్.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఈ చిత్రం ద్వారా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, విరియానా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తొలిసారి స్క్రీన్‌పై కనిపించబోతున్న ఈ ట్విన్స్ పాత్రలపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ ఇద్దరిపై రూపొందించిన ‘శ్రీకాళహస్తి’ లిరికల్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది.

మంచు విష్ణు కుమార్తెల డెబ్యూ

ఈ పాట లిరికల్ వీడియోను మే 28న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నట్లు మోహన్ బాబు గతంలో ప్రకటించారు. శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా రూపొందించిన ఈ పాటలో అరియానా, వివియానా ప్రధానంగా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఇక ‘కన్నప్ప’ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీ

ఈ భారీ మల్టీ-లాంగ్వేజ్ చిత్రాన్ని మోషన్ పిక్చర్స్, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించగా, సంగీతాన్ని స్టీవెన్ దేవాస్ అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతుండగా, లిరికల్ వీడియో రీలీజ్‌తో మళ్ళీ సినిమాపై ఆసక్తి పెరుగనుంది.

మొత్తంమీద, ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.