
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ గుణశీల పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నిడివి మరియు ప్రముఖ నటుల స్క్రీన్ టైం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Key Points
కన్నప్ప సినిమా మొత్తం నిడివి 3 గంటలు 10 నిమిషాలు.
ప్రభాస్ 30 నిమిషాలు, మోహన్ లాల్ 15 నిమిషాలు కనిపిస్తారు.
సినిమా నిడివి కంటే కంటెంట్ ముఖ్యమని మంచు విష్ణు అభిప్రాయం.
ప్రభాస్ పాత్ర కంటే ఎక్కువ సమయం ఉండటం అభిమానులను ఆనందపరుస్తోంది.
కన్నప్ప సినిమా నిడివి ఎంత?
Kannappa – Prabhas : మంచు విష్ణు కన్నప్ప సినిమాని భారీగా, స్టార్ కాస్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. దీంతో మంచు విష్ణు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేసారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నప్ప సినిమా నిడివి, ప్రభాస్, మోహన్ లాల్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తారో చెప్పాడు.
ప్రభాస్, మోహన్ లాల్ పాత్రల నిడివి
మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా టైటిల్స్ అన్ని కలుపుకొని 3 గంటల 10 నిమిషాల నిడివి ఉంటుంది. అందులో ప్రభాస్ నిడివి ఎంత కట్ చేసినా 30 నిముషాలు ఉంటుంది. మోహన్ లాల్ సర్ 15 నిముషాలు కనిపిస్తారు. అయినా నిడివితో సంబంధం లేదు. రెండు గంటల నిడివి సినిమాలు కరెక్ట్ గా తీయకపోతే అవి కూడా లెంగ్త్ గానే ఉంటుంది. మూడు గంటల సినిమా కరెక్ట్ గా ఉంటే లెంగ్త్ పెద్దగా తెలియదు అని తెలిపారు.
మంచు విష్ణు అభిప్రాయం
కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తాడు అని చెప్పినప్పుడు గెస్ట్ అప్పీరెన్స్ లాగా ఓ 5 నిముషాలు కనిపిస్తాడేమో అనుకున్నారు. కానీ విష్ణు ఇప్పుడు ప్రభాస్ 30 నిముషాలు కనిపిస్తాడు అని చెప్పడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద, కన్నప్ప సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని మంచు విష్ణు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్ కనిపించే సమయం అభిమానులకు బోనస్.


