|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నప్ప మూవీ: వాటి రేట్లు తగ్గిస్తేనే.. టికెట్ ధర పెంచడానికి ఆలోచిస్తా: మంచు విష్ణు

Published: 26-06-2025, 8:19 AM
కన్నప్ప మూవీ: వాటి రేట్లు తగ్గిస్తేనే.. టికెట్ ధర పెంచడానికి ఆలోచిస్తా: మంచు విష్ణు

కన్నప్ప సినిమా ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు టికెట్ ధరలపై స్పందించారు. తెలంగాణలో ధరలు పెంచలేదని, ఏపీలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పెంపు ఉందని తెలిపారు. పాప్‌కార్న్, కోక్ ధరలు తగ్గితేనే టికెట్ ధరలు పెంచాలని ఆలోచిస్తానని ఆయన అన్నారు.

Key Points

1

కన్నప్ప సినిమా టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు.

2

తెలంగాణలో టికెట్ ధరలకు ఎలాంటి పెంపు లేదు.

4

పాప్‌కార్న్, కోక్ ధరలు తగ్గితేనే టికెట్ ధరలు పెంచుతానని మంచు విష్ణు వ్యాఖ్య.

కన్నప్ప సినిమా టికెట్ రేట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే  టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.

తెలంగాణ, ఏపీలో టికెట్ ధరలు

అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్‌కార్న్, కోక్  ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్‌లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.

పాప్ కార్న్, కోక్ ధరలతో టికెట్ రేట్ల సంబంధం

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప.  ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది.

చివరగా, మంచు విష్ణు తన కన్నప్ప సినిమాకు టికెట్ ధరలను పెంచే విషయంలో ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాప్‌కార్న్, కోక్ ధరలు తగ్గిన తర్వాతే ఆలోచిస్తానని చెప్పడం ద్వారా ఆయన ప్రేక్షకులకు ప్రాధాన్యత ఇచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.