
📌 Key Points
- కాంతార మూవీతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
- కాంతారా చాప్టర్ వన్ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
- హోంబలే ఫిల్మ్స్‌తో రిషబ్ శెట్టికి విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.
- రిషబ్ శెట్టి తన భార్యను సహ నిర్మాతగా చేయాలని కోరడం వివాదానికి కారణమని సమాచారం.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాంతారా చాప్టర్ వన్ తర్వాత, ఇప్పుడు కాంతారా 3 ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం రిషబ్ శెట్టి తీసుకున్న నిర్ణయమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంతారా 3 ఆగిపోవడానికి కారణాలేంటి?
Kantara 3: కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈయన కాంతార మూవీతో హీరోగా మారాడు. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన మూవీ కావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.. కేవలం కన్నడలో మాత్రమే కాదు ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అంతే కాదు ఈ సినిమాకి సీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు కాంతార 3 కూడా రాబోతుంది అన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకు కారణం హీరో చేసిన ఆ పొరపాటే అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. నిజంగానే సినిమా ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
హీరో రిషబ్ శెట్టికి కాంతార సిరీస్ సినిమాలు ఎంత క్రేజ్ ను తీసుకొని వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మూడో భాగం కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫీలిమ్స్ ఈ రెండు సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించాయన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు హీరోకి నిర్మాణ సంస్థకు మధ్య విభేదాలు తలెత్తయని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి నిర్మాణ సంస్థను సోషల్ మీడియాలో ఆన్ ఫాలో చెయ్యడమే కారణమని తెలుస్తుంది.. ఇదే మరో మాట కూడా వినిపిస్తుంది.. రిషబ్ శెట్టి తన నెక్ట్స్ సినిమాల్లో ఒక కీలక మార్పు కోరుకుంటున్నారట. తన భార్య ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా భాగస్వామిని చెయ్యాలని కోరారట. కానీ నిర్మాణ సంస్థ ఒప్పుకోకపోవడంతోనే సినిమా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..
హోంబలే ఫిల్మ్స్‌తో రిషబ్ శెట్టికి విభేదాలు?
రిషబ్ శెట్టి ఇతర సినిమాలపై దృష్టి పెట్టారా?
హీరో రిషబ్ శెట్టికి ఈమధ్య దైవ విశ్వాసం ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే.. కాంతార’ సిరీస్ పక్కన పెట్టి రిషబ్ శెట్టి ఇప్పుడు ఇతర ప్రతిష్టాత్మక చిత్రాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈయన గతంలో సూపర్ హిట్ టాక్ అని అందుకున్న హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా తరికేకుతున్న జై హనుమాన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ మూవీలో హనుమాన్ పాత్రలో ఈయన నటించబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లోనూ నటిస్తున్నారు. వీటితో పాటుగా మరే రెండు ప్రాజెక్టులలో ఆయన నటిస్తున్నట్లు ఇండస్ట్రీవర్గాల్లో సమాచారం.. మరి వాటి గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
కాంతారా 3 గురించి వస్తున్న ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై రిషబ్ శెట్టి లేదా హోంబలే ఫిల్మ్స్ స్పందిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.


