|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శర్వానంద్‌తో జతకట్టనున్న ‘కాంతార’ బ్యూటీ! రుక్మిణి వసంత్ క్రేజీ అప్‌డేట్

Published: 05-01-2026, 3:30 AM
శర్వానంద్‌తో జతకట్టనున్న 'కాంతార' బ్యూటీ! రుక్మిణి వసంత్ క్రేజీ అప్‌డేట్
  • శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల.
  • శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ చేయబోయే సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక.
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం.
  • శ్రీనువైట్ల తన తదుపరి చిత్రంతో హిట్ ఇవ్వాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు.

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమా సంక్రాంతికి రానుంది. ఈ క్రమంలోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ చేయబోయే కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శర్వానంద్ వరుస చిత్రాల విశేషాలు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన హీరో శర్వానంద్‌(Sharwanandh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట. ఈ సినిమాలో రుక్మిణీ వ‌సంత్‌ను హీరోయిన్‌‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతుందట. కాగా, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ యావరేజ్‌గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ తన తర్వాత సినిమాతో హిట్ ఇవ్వాలనే థాట్‌తో శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. ఇక కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్‌లో జరిగే డ్రామా.. దాని నుంచి అతను ఎలా బయట పడుతాడనేది స్టోరీ అంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీనువైట్ల-శర్వానంద్ కాంబినేషన్: హీరోయిన్ ఫిక్స్

రుక్మిణి వసంత్ – టాలీవుడ్ డెబ్యూ అప్‌డేట్

రుక్మిణి వసంత్, శర్వానంద్ జోడిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.