|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అలియా భట్ సినిమాలు అవుట్

Published: 05-10-2025, 2:15 AM
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్.. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అలియా భట్ సినిమాలు అవుట్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 225 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. రామ్ చరణ్, సల్మాన్, అలియా భట్ వంటి స్టార్ హీరోల చిత్రాల కలెక్షన్లను దాటేసి దూసుకుపోతోంది.

Key Points

1

కాంతార చాప్టర్ 1 మూడు రోజుల్లో రూ. 225 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

2

ఇండియాలో రూ. 162.85 కోట్ల నెట్, రూ. 195.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

4

హిందీ బెల్ట్, ఓవర్సీస్ నుంచి కూడా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్త వసూళ్లు

కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: రిషబ్ శెట్టి హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మరో సినిమా కాంతార చాప్టర్ 1 . అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన కాంతార 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

దసరా రోజున బంపర్ ఓపెనింగ్ తరువాత రెండో రోజు మందగించిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ మూడో రోజు పెరిగాయి. ముూడో రోజున అంటే శనివారం (అక్టోబర్ 4) నాడు ఇండియాలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 55 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

అంటే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు సుమారుగా 15 శాతం వరకు కలెక్షన్స్ పెరిగాయి. అలాగే, మూడు రోజుల్లో ఇండియాలో కాంతార 2 సినిమాకు రూ. 162.85 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, రూ. 195.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

200 కోట్ల మార్కు దిశగా కాంతార

ఆదివారం కలెక్షన్స్ ముగిసేసరికి కాంతారా 2 చిత్రం రూ. 200 కోట్ల దేశీయ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కన్నడ వెర్షన్‌లో మూడో రోజు ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొత్తంగా 94 శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

హిందీ బెల్ట్ నుంచి కూడా కాంతార 2 మూవీకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పటికీ ఇండియాలో హిందీ ద్వారా రూ. 40 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం. అలాగే, ఓవర్సీస్‌లో మూడు రోజుల్లో కాంతార చాప్టర్ 1 చిత్రానికి 3 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.

పెద్ద సినిమాల కలెక్షన్లను దాటేసిన కాంతార

ట్రేడ్ నిపుణుల ప్రకారం కాంతార చాప్టర్ 1 మూవీకి మూడు రోజుల్లో రూ. 225 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ సల్మాన్ ఖాన్ సికందర్ (రూ. 176 కోట్లు), రామ్ చరణ్ గేమ్ చేంజర్ (రూ. 200 కోట్లు), సంజయ్ లీలా భన్సాలీ- అలియా భట్‌ ల గంగూబాయి కతియావాడి (రూ. 210 కోట్లు) వంటి 3 సినిమాలతో సహా ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది.

ఇక ఇప్పుడు కాంతార 2 మూవీ రూ. 250 కోట్ల మార్క్ వైపుకు దూసుకుపోతోంది. ఈ టార్గెట్‌ను ఆదివారం మధ్యాహ్నం నాటికి సులభంగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాంతార చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 225 కోట్లు వసూలు చేసి, పలు పెద్ద చిత్రాల కలెక్షన్లను అధిగమించి విజయ పరంపరను కొనసాగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.