|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురుసు ప్రవర్తన.. టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు!

Published: 15-05-2025, 4:43 AM
దురుసు ప్రవర్తన.. టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ రాంగ్ రూట్‌లో కారు నడపడం, ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై ట్రాఫిక్ పోలీసులపై దురుసు ప్రవర్తనకు కేసు నమోదు.

2

రాంగ్ రూట్ లో కారు నడపడం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం కారణంగా కేసు.

4

పోలీసులు శ్రీనివాస్‌ను విచారించనున్నారు, మద్యం సేవించి వాహనం నడిపారా అన్న విషయంపై దర్యాప్తు.

ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణ

సాక్షి, బంజారాహిల్స్‌: రాంగ్‌రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్‌ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్‌ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్‌రూట్‌లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ అతడిని అడ్డుకున్నాడు.

వీడియో వైరల్

పోలీసుల విచారణ

దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌ సదరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్‌ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా వైరల్‌ కావడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌పై నమోదైన కేసు దర్యాప్తు జరుగుతోంది. మద్యం సేవించి వాహనం నడిపారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాతే స్పష్టత వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.