|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శివాజీ గణేషన్ vs గౌండమణి: అహంకారంతో అవమానించిన శివాజీ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కమెడియన్! మాస్ స్టోరీ!

Published: 12-02-2026, 4:35 AM
శివాజీ గణేషన్ vs గౌండమణి: అహంకారంతో అవమానించిన శివాజీ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కమెడియన్! మాస్ స్టోరీ!
  • శివాజీ గణేషన్ ఇంట్లో విందులకు గౌండమణి ఎప్పుడూ వెళ్ళలేదు
  • ప్రభు ద్వారా గౌండమణిని విందుకు పిలిపించిన శివాజీ
  • విందులో గౌండమణిని అవమానించిన శివాజీ గణేషన్
  • ‘దేవర్ మగన్’ ప్రివ్యూలో శివాజీ నటనపై గౌండమణి కౌంటర్!

కోలీవుడ్ దిగ్గజం శివాజీ గణేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కమెడియన్ గౌండమణికి మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూస్తే షాక్ అవ్వడం ఖాయం.

గౌండమణిని అవమానించిన శివాజీ గణేషన్?

కోలీవుడ్‌ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్‌ తమిళ సినిమాని శాసించిన విషయం తెలిసిందే. అన్ని రకాల పాత్రలు, సినిమాలతో మెప్పించారు. లెజెండరీ నటిగా రాణించారు. అయితే ఆయనకు, కమెడియన్‌ గౌండమణికి మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.  ఆ విశేషాలను నటుడు గౌండమణి వెల్లడించారు. శివాజీ గణేశన్ ఎప్పుడైనా డల్‌గా ఉన్నా,  ‘ఒరేయ్… ఆ గౌండమణి జోకులు కాస్త పెట్టండ్రా’ అని చెప్పి, ఆయన కామెడీ సీన్లు చూసి రిఫ్రెష్ అయ్యేవారట. కానీ, ఆ ఇద్దరి మధ్య ఓ తెలియని ఈగో వార్ నడుస్తూ ఉండేది. శివాజీ గణేశన్ ఇంట్లో తరచూ విందులు జరుగుతుండేవి. కానీ గౌండమణి ఎవరి ఇంటికీ విందుకు వెళ్లేవారు కాదు. గౌండమణి నియమాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని శివాజీ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ప్రభు, గౌండమణి కలిసి చాలా సినిమాలు చేస్తుండటంతో వారి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహాన్ని వాడుకుని, ప్రభు ద్వారా గౌండమణిని ఇంటికి పిలిచి విందు ఇవ్వాలని శివాజీ ప్లాన్ చేశారు.

‘ఆ గౌండర్‌ని విందుకు పిలుచుకురా’ అని శివాజీ ఆదేశించడంతో, ప్రభు నేరుగా గౌండమణి ఇంటికి వెళ్లారు. ‘అన్నా… నాన్నగారు ఇప్పటివరకు ఎవరినీ ఇంటికి వెళ్లి మరీ విందుకు పిలవలేదు. మిమ్మల్ని మొదటిసారి ఇలా పిలుస్తున్నారు. నాకే ఆశ్చర్యంగా ఉంది’ అని ప్రభు చెప్పడంతో గౌండమణి కాదనలేకపోయారు. శివాజీ ఇల్లు ‘అన్నై ఇల్లం’కు వెళ్లేసరికి చాలామంది భోజనం చేస్తున్నారు. గౌండమణి కారు దిగగానే శివాజీ, ‘ఏమయ్యా గౌండర్… బాగున్నావా?’ అని పలకరించి కూర్చోబెట్టారు. అందరూ లోపల భోజనం చేస్తుంటే, గౌండమణికి మాత్రం హాల్‌లోనే భోజనం వడ్డించారు. అంతటితో ఆగకుండా, ‘గౌండరే… మా ఇంట్లో ఇలా విందులు పెట్టడం మామూలే. నలుగురికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అందుకే నిన్ను కూడా పిలిచాను’ అని గౌండమణిని నేరుగా అవమానించారు శివాజీ.

దేవర్ మగన్ సినిమాలో శివాజీ నటనపై గౌండమణి రియాక్షన్

ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ‘దేవర్ మగన్’ సినిమా ప్రివ్యూ షో వేశారు. ఆ థియేటర్‌కు గౌండమణి కూడా వచ్చారు. సినిమా చూసిన వాళ్లంతా శివాజీ నటనను తెగ పొగిడారు. దీంతో శివాజీ చాలా సంతోషంగా కనిపించారు. సినిమా అయ్యాక గౌండమణి పక్కనుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అది చూసిన శివాజీ, ‘అదిగో వెళ్తున్నాడు చూడు గౌండర్. వాడిని పిలవండి’ అని పిలిపించారు. గౌండమణి దగ్గరికి రాగానే, ‘ఈ సినిమాలో దేవర్ జీవించేశాడు కదా? నా నటన ఎలా ఉంది? ఊరిని కంట్రోల్‌లో పెట్టే దేవర్ గంభీరంగా ఉన్నాడా?’ అని అడిగారు. దానికి గౌండమణి, ‘సినిమా గురించి ఒకటి చెబుతాను, మీరేమీ తప్పుగా అనుకోవద్దు’ అని కోరారు. ‘ఏమీ అనుకోను, నీ అభిప్రాయం చెప్పు’ అని శివాజీ అన్నారు. వెంటనే గౌండమణి, ‘మీరు సినిమాలో పెద్ద దేవర్. మీరు నడిస్తే ఊరు నడుస్తుంది, మీరు నిల్చుంటే ఊరు కూర్చుంటుంది. అంత పెద్ద మనిషి మీరు. కానీ ఒక చిన్న పిల్లాడు తొక్కడం వల్ల చనిపోయారేంటి? ఇంతకుమించి సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు’ అని ముఖం మీదే చెప్పేశారు.

అహంకారానికి దిమ్మతిరిగే కౌంటర్!

ఆ సమాధానం ఊహించని శివాజీ గణేశన్, నోట మాట రాక నిశ్చేష్టులయ్యారు. తనకు గతంలో జరిగిన అవమానానికి గౌండమణి ఈ రకంగా బదులు తీర్చుకుని ఇంటికి వెళ్లారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని దివంగత సినీ జర్నలిస్ట్ నెల్లై భారతి ఒక సందర్భంలో పంచుకున్నారు. ఇప్పుడీ విషయం వైరల్‌ అవుతుంది.

శివాజీ గణేషన్, గౌండమణిల మధ్య జరిగిన ఈ సంఘటన కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.