
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 రివ్యూ ఇక్కడ ఉంది. ఇది బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్. 8వ శతాబ్దంలో జరిగే ఈ కథ, గ్రాఫిక్స్, బ్లాక్ మ్యాజిక్ అంశాలతో ఆకట్టుకుంది. మరి రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడా? తెలుసుకుందాం.
Key Points
కాంతార చాప్టర్ 1, బ్లాక్ బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది.
కథ 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యంలో జరిగే పోరాటాలు, బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరుగుతుంది.
రిషబ్ శెట్టి 'బెర్మే' పాత్రలో నటించి, సినిమా కథ, దర్శకత్వం కూడా అందించారు.
గ్రాఫిక్స్, కథనం ఆకట్టుకున్నా, కాంతార క్లైమాక్స్ ఇచ్చినంత హై ఈ ప్రీక్వెల్ ఇవ్వలేదు.
కాంతార చాప్టర్ 1 కథాంశం
నటీనటులు: రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమ్మిడి, దీపక్ రాయ్, రాకేష్ పూజారి, పూరి ప్రశాంత్ తదితరులు
కథ, దర్శకత్వం: రిషబ్ శెట్టి
సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్,కేఎం ప్రకాశ్,
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్
విడుదల తేది: అక్టోబర్ 02, 2025
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సినిమా కాంతార. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన మూవీనే కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 ఇవాళ (అక్టోబర్ 02) థియేటర్లలో విడుదల అయింది.
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం
అయితే, విడుదలకు ఒకరోజు ముందుగానే మీడియాకు కాంతార చాప్టర్ 1 స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కాంతార చాప్టర్ 1 రివ్యూ లో తెలుసుకుందాం.
ఇది 8వ శతాబ్ధంలో జరిగే కథ. కదంబుల రాజ్యంలో కాంతార అనే అటవి ప్రాంతం ఉంటుంది. ఆ కాంతార ప్రాంతానికి రక్షకుడిగా గిరిజన తెగ నాయకుడు బెర్మే (రిషబ్ శెట్టి) ఉంటాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేందుకు కాంతార వర్గం పోరాటం చేస్తుంటుంది. ఈ విషయంలో వీరు మరో వర్గం బంగ్రాతో పోరాటం చేస్తుంటారు.
బంగ్రా వర్గానికి రాజ విజయేంద్ర అలియాస్ రాజశేఖర్ (జయరాం) నాయకుడు. అతనితోపాటు యువరాజు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య), యువరాణి కనకవతి ( రుక్మిణి వసంత్ ) పాలకులుగా ఉంటారు. కాంతార ప్రాంతలోని దేవుడి విగ్రహం కోసం బంగ్రా తెగ ప్రయత్నం చేస్తుంటుంది. వీరితోపాట కాంతార వర్గంపైకి మరో తెగ కూడా పోటీకి వస్తుంది.
మరి తమ ప్రాంతాన్ని కాంతార వర్గం కాపాడుకుందా? నాయకుడు బెర్మే పుట్టుక రహస్యం ఏంటీ? కాంతార ప్రాంతాన్ని రక్షించేందుకు వచ్చే దైవం ఏంటీ? బంగ్రా పాలకులు పన్నిన కుట్ర ఏంటీ? ఈ పోరాటంలో బెర్మే విజయం సాధించాడా? అనేది తెలియాలంటే కాంతార చాప్టర్ 1 సినిమా చూడాల్సిందే.
సూపర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా ఓ మూవీ వస్తుందనగానే అంచనాలు అలా పెరిగిపోయాయి. కాంతార కంటే కాంతార చాప్టర్ 1 ఎలాంటి అనుభూతిని ఇస్తుందనేదే అందరిలో మెదిలిన ప్రశ్న. మరి అలాంటి అంచనాలతో వచ్చిన కాంతార చాప్టర్ 1 మెప్పించిందా అంటే.. మెప్పించిందనే చెప్పాలి.
ఎప్పుడైన ఫ్రెష్‌నెస్‌కు ఉన్న ఫీల్ ఆ తర్వాతి ఎక్స్‌పీరియెన్స్‌కు రాదు. అలానే కాంతార క్లైమాక్స్ ఇచ్చిన అంత హై కాంతార చాప్టర్ 1 ఎండింగ్ ఇవ్వలేదు. కానీ, ఓవరాల్‌గా ఈ ప్రీక్వెల్ మూవీ మాత్రం అదిరిపోయింది. గ్రాఫిక్స్, స్టోరీ, సినిమాటోగ్రఫీతో అలా చూస్తూ ఉండేలా చేస్తుంది కాంతార 2.
గ్రాఫిక్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలా ఉన్నాయి?
ఫస్టాఫ్‌లో చాలా వరకు హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. వాటిని థియేటర్లలో చూస్తేనే మంచి ఫీల్ వస్తుంది. దట్టమైన కాంతార అడవిలో జరిగే కథ కాబట్టి జంతువుల ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. వాటి సీజీ వర్క్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్‌లో వచ్చే 15 నిమిషాల సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.
అయితే, సెకండాఫ్‌లో కాస్తా స్లో నెరెషన్ కారణంగా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. కాంతారకు ప్రీక్వెల్‌ను బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, క్లైమాక్స్‌లో మళ్లీ హై మూవ్‌తో ఆకట్టుకుంటుంది. దాదాపుగా ఊహించే సన్నివేశాలతో సినిమా సాగుతుంది. కానీ, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది కాంతార 2.
యానిమల్స్, మైథలాజికల్, యాక్షన్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సంగీతం, బీజీఎమ్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమా చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఇక డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి మరోసారి మెప్పించారు. టేకింగ్, స్టోరీ చాలా బాగుంది.
కొన్నిచోట్ల మైనస్‌లు పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇక నటుడిగా విశ్వరూపం చూపించాడు రిషబ్ శెట్టి. యాక్టింగ్‌లో మరో స్థాయికి వెళ్లిపోయాడు. రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అలాగే, గుల్షన్ దేవయ్య పర్ఫామెన్స్ బాగుంటుంది. రుక్మిణి వసంత్ చాలా గ్లామర్‌గా అట్రాక్ట్ చేసింది. నటనతో సైతం మెప్పించింది.
మిగతా పాత్రలు అన్ని పర్‌ఫెక్ట్‌గా చేశాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కచ్చితందా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన విజువల్ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాంతార చాప్టర్ 1.
మొత్తంగా, కాంతార చాప్టర్ 1 ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. అంచనాలను కొంతవరకు అందుకున్న ఈ ప్రీక్వెల్, గ్రాఫిక్స్, కథనం, రిషబ్ శెట్టి నటనతో ఆకట్టుకుంది. కాంతార ఇచ్చిన హై కాకపోయినా, ఈ చిత్రం మాత్రం అదిరిపోయింది.


