
📌 Key Points
- నాగబాబు, గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ సిరీస్‌కు హైలైట్. వారి పాత్రలు నవ్వులు పూయించాయి.
- గ్రామీణ నేపథ్యం, కోడి పందెం ఎమోషన్ సిరీస్‌కు ప్రధాన బలం. కథను ఆసక్తిగా మలిచారు.
- సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఉన్నా, కొన్ని చోట్ల సాగదీతగా అనిపించింది. విలన్ రివీల్ తొందరగా జరిగింది.
- అబ్బా గ్రూప్ కామెడీ, లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ బలహీనంగా ఉన్నాయి.
నాగబాబు, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మేము కాప్‌లం’ వెబ్‌సిరీస్ ఓటీటీలో సందడి చేస్తోంది. గ్రామీణ నేపథ్యం, కామెడీ, సస్పెన్స్ కలగలిసిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా అలరించింది? తెలుసుకోవాలంటే ముందుకు చదవండి!
నాగబాబు, గెటప్ శ్రీనుల నటన అదరగొట్టిందా?
ఈ వెబ్ సిరీస్‍కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కు నిర్మాత బీవీఎస్ రవి. మొత్తం 6 ఎపిసోడ్లతో రూపొందించారు. ఈ వెబ్‌సిరీస్‌లో కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం కలిపి వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు.
మహాదేవపట్నం అనే గ్రామంలో గజపతి రాజు(నాగబాబు) అనే వ్యక్తి చాలా ఉంటాడు. గ్రామంలో అతను చెప్పిందే వేదం. అతని పందెం కోడి “సలార్ రాజు”ను కన్న కొడుక్కంటే ఎక్కువగా చూసుకుంటారు గజపతి రాజు. ప్రతి సంక్రాంతి జరిగే కోడి పందెల్లో గెలిచే సలార్ రాజు కనిపించకపోవడంతో కథ మొదలవుతుంది. దానిని వెతికే బాధ్యత ఎస్ఐ రవి, కానిస్టేబుల్ మోహన్(గెటప్ శ్రీను)లపై పడుతుంది. మిస్సింగ్ కేసులా కనిపించిన ఈ వ్యవహారం క్రమంగా గ్రామంలో జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు, చేతబడుల ప్రచారం, అక్రమ వ్యవహారాల వైపు మళ్లుతుంది.
కథ, కథనం: సస్పెన్స్, కామెడీ ఎంతవరకు పండాయి?
ఈ సిరీస్‌కు ప్రధాన బలం రవి-మోహన్ పాత్రల మధ్య వచ్చే కామెడీ ట్రాక్. అమాయకత్వం, అతితెలివి కలిపిన పోలీస్ పాత్రల్లో రవితేజ , గెటప్ శ్రీను ఎప్పటిలానే తన కామెడీ టైమింగ్ తో అలరించారు. కోడి కేసులో వారు చేసే హడావిడి నవ్వులు పంచుతుంది. మొత్తం చూస్తే ఈ సిరీస్ ను గెటప్ శ్రీను నడిపించినట్లు అనిపిస్తుంది. గజపతి రాజు పాత్రలో, ఊరిపెద్దగా నాగబాబు వావ్ అనిపించారు.
గోదావరి ప్రాంతంలో కోడి పందెలనేవి ఒక ఎమోషనల్ థింగ్. దాన్నే మెయిన్ ఎలిమెంట్ గా తీసుకుని కథ మలిచిన తీరు బాగుంది. దానికి కథ మొత్తం కోడి పందెల చుట్టూనే తిరుగుతుంది. కోడిని వెతికి క్రమంలో ఊర్లో జరుగుతున్న ఘోరాలు, మూఢనమ్మకాలు, ఊరి పెద్దలే చేసే అరచకాలు బయటపడుతాయి. సిరీస్ చూస్తున్న కొద్దీ సస్పెన్స్ లు ఉంటాయి. చివరి వరకు ఒక్కో పాత్రపై మళ్లిస్తూ కథను నడిపించారు.కోడి పందెలు ఆపించాలని అబ్బా అనే గ్రూప్ చేసే కామెడీ అంతగా పండలేదు. ఏదో ఇరికించినట్లుగా ఉంది. ఎస్ ఐగా రవి నవ్వించి, ఏడిపిస్తారు.
ప్లస్సులు, మైనస్సులు: చూడదగ్గ వెబ్‌సిరీస్సేనా?
అయితే సిరీస్ చూస్తున్న కొద్దీ..అక్కడక్కడా సాగదీతగా అనిపిస్తుంది. దానికి తోడు ఇన్వెస్టిగేషన్ సీన్ అతికించినట్లు ఉంటుంది. ఇంకాస్త కామెడీ పంచి ఉంటే హైలెట్ అయ్యేది. లవ్ ట్రాక్ పెట్టినా ఈ సిరీస్ కు అంత సెట్ కాలేదనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన మైనస్ ఏంటంటే…విలన్ ఎవరనేది మరీ వేగంగా చెప్పేశారు. దానికి ఇంకాస్త కథ రాసుకుని హైలెట్ చేసుంటే బాగుండేది. థ్రిల్ మరింత పెరిగేది. సిరి పార్వతి, రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, కిరీటీ వారి పరిధి మేరకు మెప్పించారు. టెక్నికల్‌గా చూస్తే కోనసీమ అందాలను సినిమాటోగ్రఫీ బాగా చూపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్టే ఉంది. నిర్మాణ విలువలు వెబ్‌సిరీస్ స్థాయిని మించి కనిపిస్తాయి.
మొత్తంగా “మేము కాప్‌లం” పూర్తి స్థాయి థ్రిల్లర్ కాకపోయినా, గ్రామీణ కామెడీతో కలిపిన లైట్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా ఒకసారి చూడదగ్గ వెబ్‌సిరీస్‌గా నిలుస్తుంది. నవ్వులు, చిన్న చిన్న ట్విస్టులు ఇష్టపడే ప్రేక్షకులకు ఇది టైంపాస్ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తుంది. ఇది ప్రేక్షకుడి దృష్టి కోణం మాత్రమే.
మొత్తంగా, ‘మేము కాప్‌లం’ కొన్ని లోపాలు ఉన్నా, నాగబాబు, గెటప్ శ్రీనుల నటన కోసం ఒకసారి చూడొచ్చు. ఈ వెబ్‌సిరీస్‌పై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూనే ఉండండి!


